Sunday, April 28, 2024

ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా

- Advertisement -
- Advertisement -
  • సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి: తెలంగాణ రా ష్ట్రంలో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు ప్రభుత్వాసుపత్రుల్లో అందించేలా ప్రభుత్వ ఆసుపత్రులను అ భివృద్ధి చేసి పడకల సంఖ్యను పెంచారని, ప్రజల ఆ రోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని కలెక్టర్ శరత్ అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని పిఎస్‌ఆ ర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యదినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య సదుపాయాలు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. వ్యాధి ని రోధక టీకాలు ఇకప్పుడు 72శాతం మాత్రమే ఉండేదని ఇప్పుడు వందకు వంద శాతం ఇస్తున్నారన్నారు.

ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాలు 49 శాతం నుంచి 87శాతానికి పెరిగాయన్నారు. కెసిఆర్ కిట్ వైద్యుల కృషితో 87శాతం ప్రసవాలలో జిల్లా రాష్ట్రం లో ముందంజలో ఉందన్నారు. ప్రసవమాయ్యక 16వస్తువులతో కూడిన కెఈరా కిట్ ఇస్తున్నారని తల్లి బిడ్డలకు పోషకాహార లోపం ఉండకూడదని రెండు విడతలుగా కడుపులో బిడ్డ ఉన్నప్పుడే న్యూ ట్రిషన్ కిట్ ఇస్తున్నామన్నారు. మగ పిల్లవాడు పుడి తే 12వేలు, ఆడపిల్ల పుడితే 13వేల రుపాయలు దశలవారీగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కంటి వెలు గు కార్యక్రమంలో జిల్లాలోనే కంటి పరీక్షలు చేసుకున్నదానిలో నెంబర్1గా నిలిచిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలు అందుతున్నాయన్నారు.

ప్రభుత్వం 510కోట్లతో ప్ర భుత్వ మెడికల్ కాలేజీ,42కోట్లతో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేశారన్నారు. గతంలో 780బెడ్స్ ఉంటే ఇప్పుడు 1530పడకలు ఉన్నాయన్నారు. 600ల పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారన్నారు. సుమారు 702కోట్లతో జిల్లాలోని ప్రతి ప్రభుత్వాసుపత్రి ప్రయివేటుకు దీటుగా ఉండేలా తీర్చిదిద్దారన్నారు. ఒకప్పుడు జిల్లాలో 22మంది స్పెషలిస్టులు ఉంటే ఇప్పుడు 153మంది ఉన్నారన్నారు. డిసిసిబి వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యం మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగాలలో సిఎం కెసిఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత విజేందర్‌రెడ్డి, జిల్లా వైధ్యాధికారి గాయత్రీదేవీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్, సిడిసి చైర్మెన్ బుచ్చిరెడ్డి, నాయకులు కొండల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News