Monday, May 6, 2024

ఇప్పట్లో కోతలు లేనట్టే 

- Advertisement -
- Advertisement -

There are currently no cuts in salaries for cricketers

 

బిసిసిఐ కోశాధికారి ధుమాల్

ముంబై: క్రికెటర్లకు ఇచ్చే వేతనాల్లో ఇప్పటికైతే ఎలాంటి కోతలు విధించడం లేదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. అయితే క్రికెటర్లు, బిసిసిఐ అధికారుల ట్రావెల్, వసతి సౌకర్యాలు తదితర అంశాల్లో మాత్రం కాస్త కోత విధిస్తున్నట్టు వివరించారు. లాక్‌డౌన్ వల్ల ఎక్కడి క్రికెట్ టోర్నీలు అక్కడే నిలిచి పోవడం, పలు సిరీస్‌లు వాయిదా పడడంతో బిసిసిఐ ఆర్థికంగా చాలా నష్టపోయిందన్నారు. అయినా క్రికెటర్లకు ఇచ్చే వేతనాలను నిలిపి వేయడంకానీ, కోతలు విధించడం కానీ చేయడం లేదన్నారు. కాగా, కొంతకాలంగా భారత క్రికెట్ బోర్డుకు రావాల్సిన స్థాయిలో ఆదాయం రావడం లేదనే విషయంలో ఎలాంటి సందేహం లేదని అరుణ్ పేర్కొన్నారు. అయినా బిసిసిఐ మాత్రం క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి సకాలంలోనే వేతనాలు అందిస్తుందన్నారు.

ఇదిలావుండగా కరోనా వల్ల ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన ఐపిఎల్ పూర్తిగా రద్దయితే మాత్రం బిసిసిఐకి ఆర్థికంగా పెద్ద ఎదురుదెబ్బగానే రుమాల్ అభివర్ణించారు. ఐపిఎల్ జరగక పోతే బిసిసిఐ ఎంత లేదన్న దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం ఖాయమన్నారు. ఇదే జరిగితే ఆర్థిక కష్టాలు పెరిగి బిసిసిఐ నష్టాల్లో కూరుకు పోవడం తప్పక పోవచ్చన్నారు. ఇలాంటి స్థితిలో ఆటగాళ్లకు చెల్లించే వేతనాల్లో భారీగా కోతలు విధించినా ఆశ్చర్యం లేదన్నారు. అయితే దీనిపై ఇప్పటికిప్పుడూ ఎలాంటి ప్రకటన చేయలేమన్నారు. ఈ ఏడాది చివరిలోనైనా ఐపిఎల్ నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ధుమాల్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News