Sunday, May 5, 2024

భారత్‌లో టెస్లా ఉత్పత్తితో ఎలాంటి సమస్య లేదు

- Advertisement -
- Advertisement -

There is no problem with Tesla production in India

కానీ చైనా నుంచి వాహనాల దిగుమతి వద్దు: గడ్కరీ

న్యూఢిల్లీ : భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు సిద్ధమైతే ఎలాంటి సమస్య ఉండదని, కానీ చైనా నుంచి కంపెనీ కార్లను దిగుమతి చేసుకోవడానికి మాత్రం ప్రభుత్వం వ్యతిరేకమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రైజింగ్ డైలాగ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారత్ అతిపెద్ద మార్కెట్ కల్గివుందని, ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు. ‘ఎలోన్ మస్క్ (టెస్లా సిఇఒ) భారత్‌లో కార్లను తయారు చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. భారత్‌కు వచ్చి ఉత్పత్తిని ప్రారంభించండి. భారత్ అతిపెద్ద మార్కెట్ కల్గినది, భారత్ నుంచి ఎగుమతి చేయవచ్చు’ అని ఆయన అన్నారు. ఒకవేళ చైనాలో తయారు చేసి, భారత్‌లో విక్రయించాలనుకుంటే భారత్‌కు ఇది మంచి పరిణామం కాదని అన్నారు. వెండార్స్ అందుబాటులో ఉన్నారని, అన్ని రకాల టెక్నాలజీలను, స్పేర్ పార్ట్‌ను భారత్ కల్గివుందని మంత్రి తెలిపారు. గతేడాది కూడా గడ్కరీ ఇదే విధంగా టెస్లా సిఇఒ మస్క్‌కు సూచన చేస్తూ, పన్ను రాయితీలను పరిశీలించడానికి ముందు భారత్‌లో విద్యుత్ వాహనాలను తయారీని ప్రారంభించాలని అన్నారు.

బ్యాటరీ ప్రమాదాలపై చర్యలు చేపట్టండి

వేసవి కాలం కావడం ఎండలు మండిపోవడంతో పాటు పలు కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ కంపెనీలను కోరారు. లోపాలు ఉన్న వాహనాలను రీకాల్ చేయాలని, తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఇప్పుడే ప్రారంభమైందని, అయితే భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News