Thursday, May 2, 2024

ఆ క్రెడిట్ అంతా తారక్ అన్నదే

- Advertisement -
- Advertisement -

హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్. ఒరిజినల్స్ బ్యానర్స్‌పై మహేష్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘తిమ్మరుసు’ ట్రైలర్ విడుదల కావడంతో భారీగా వ్యూస్ వచ్చాయి. ఆ క్రెడిట్ అంతా కూడా తారక్ అన్నదే. దీంతో తమ సినిమా స్థాయి పెరిగింది. ఇక ‘తిమ్మరుసు’ సినిమాను కేవలం 39 రోజుల్లో సింగిల్ షెడ్యూల్‌లో ముగించాము. ఇక నేను నటించిన సినిమాలన్నీ థియేటర్ల ద్వారా బ్యాక్ టు బ్యాక్ రెండు నెలలకు ఒకటి చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. గుర్తుందా శీతాకాలం, స్కైలాబ్ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక కరోనా సమయంలో కొందరు ఓటీటీల వైపు చూశారు కాని ఎక్కువ శాతం మంది మాత్రం థియేటర్ల వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎదురుచూస్తున్నారు”అని అన్నారు.

Thimmarusu movie to released on July 30

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News