Sunday, August 10, 2025

వార ఫలాలు (10-08-2025 నుండి 16-08-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం  చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరి మీద ఆధారపడి జీవించకూడదు అనే భావన ఏర్పడుతుంది. గ్రీన్ కార్డు వీసా వంటి విషయాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు తీరుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మీ శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చక్కగా రాణించగలుగుతారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ మీ చేతికి అందుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. నూతన బ్రాంచీలను నెలకొల్ప గలుగుతారు. అన్నదానం చేస్తారు దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విహారయాత్రలకు కొన్ని రోజులు దూరంగా ఉండండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఉద్యోగ పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఏర్పడవు. సహా ఉద్యోగులతో సఖ్యత ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని మొగిలి పువ్వు కుంకుమతో ఆరావళి కుంకుమతో పూజించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ.

మిథునం:  మిధున రాశి వారికి  ఈ వారం  అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. మీకున్న తెలివితేటలతో నలుగురిని ఆకట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సమయం అంతా అనుకూలంగా లేదు. కుటుంబ బాధ్యతలను మీ భుజస్కందాలపై వేసుకొని మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ శ్రావణమాసంలో మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో ప్రతిరోజు పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి   కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి  ఈ వారం  సానుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో చక్కగా రాణిస్తారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. నూతన వస్తువులు బంగారం విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటిస్తారు. ఈ శ్రావణమాసంలో అమ్మవారికి కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో ప్రతిరోజు పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం  అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలకు పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. పొదుపు పైన దృష్టి పెట్టండి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ మంచి ఫలితాల కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. ఆర్థికంగా ప్రణాళిక చేసుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు శ్రీరామ స్తోత్రం చదవాలి. లక్ష్మీనారాయణ వత్తులతో దీపారాధన చేయండి. మహాలక్ష్మి అమ్మవారిని కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో పూజించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే.

కన్య:    కన్యా రాశి వారికి  ఈ వారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరత్వం లేని నిర్ణయాల వలన ఇబ్బంది పడతారు. రాజకీయరంగంలో ఉన్న వారికి కొన్ని విమర్శలు ఎదురవుతాయి. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి. ఆరోగ్య పరంగా బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారిని కుబేర కుంకుమతో ఆరావలి కుంకుమతో పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. నూతన గృహ యోగం ఉంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంట బయట నిరుత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు తెలుపు.

తుల:  తులారాశి వారికి ఈ వారం  అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం యొక్క అభివృద్ధి గడిచిన రెండు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుంది. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపార విస్తరణకు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నీ మనోధైర్యమే మిమ్మల్ని చాలా విషయాలలో ముందుకు  నడిపిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారిని కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ  వారం వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. చిరు వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి హోటల్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. సినీ రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. భూ సంబంధిత వివాదాలు తొలగిపోతాయి. ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడతాయి. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచన చేస్తారు. ఉద్యోగ పరంగా కొన్ని చికాకులు పెరుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు గట్టిగా ప్రయత్నం చేయండి తప్పకుండా వస్తుంది. కొన్నిసార్లు అనాలోచిత కార్యక్రమాల వల్ల కూడా ఇబ్బంది పడతారు. మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామరవత్తులతో అమ్మవారికి దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం  చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ పరంగా కొన్ని నూతన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయంగా మీరు అనుకున్న స్థాయిని సాధించగలుగుతారు. పై అధికారుల మెప్పు పొందగలుగుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విష వ్యవహారాలు సానుకూల పడతాయి. ఉద్యోగం మారడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నవారికి ఈ వారం ఒక మంచి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. మంగళవారం రోజున ఆంజనేయస్వామి వారికి ఆకు పూజ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగు తెలుపు.

మకరం:   మకర రాశి వారికి ఈ  వారం   మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా లాభాలు నష్టాలు రెండు చూడవలసి వస్తుంది. ఆరోగ్య పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా బయట అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలతి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగున్నాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రుణ వత్తిడీల నుండి బయటపడతారు. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగ పరంగా రావలసిన అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. విదేశాలు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కొన్ని కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు బ్రౌన్.

 

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం  చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతి పనిలో లాభాలు బాగుంటాయి. కుటుంబంలో శుభకార్యాలకు ప్రస్తావన ఉంటుంది. కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య పరంగా కూడా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోతాయి. వృధా ఖర్చులకు అడ్డుకట్ట వేయగలుగుతారు. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైన లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఈ శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారిని ఆరావళి కుంకుమతో పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

 

మీనం: మీన రాశి వారికి ఈ వారం   అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా మంచి లాభాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. గడిచిన కొన్ని వారాలంటే కూడా ఖర్చులు చాలా తక్కువ అవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు  రావలసినటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి. నలుగురిలో మీకంటూ ఒక స్థానం సంపాదించుకోగలుగుతారు. ఇంకా బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అహంకారమైన ధోరణికి దూరంగా ఉండండి. ఆదాయం మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం  సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి సుందరకాండ పారాయణ చేయండి. మహాలక్ష్మి అమ్మవారిని కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.బ్లూ.

Rasi phalalu cheppandi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News