Sunday, May 5, 2024

చైనాతో ప్రపంచ భద్రతకు ముప్పు

- Advertisement -
- Advertisement -

Threat to global security with China:NATO

నాటో కూటమి ఆందోళన
తిప్పికొట్టాలని నిర్ణయం
తొలిసారిగా చైనాపై ఘాటు స్పందన

బ్రసెల్స్ : చైనాతో ప్రపంచభద్రతకు పెను సవాలు తలెత్తిందని నాటో కూటమి దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రాపంచిక వ్యవస్థకు చైనా నుంచి ఎప్పటికప్పుడు అనేక రకాల చిక్కులు ఏర్పడుతున్నాయని నాటో తెలిపింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ ప్రాబల్యాన్ని నివారించేందుకు నాటో కూటమి ఏర్పడింది. ఇప్పటివరకూ నాటో కూటమి రష్యానే శత్రువుగా భావిస్తూ వచ్చింది. అయితే ప్రపంచ పరిస్థితులతో చైనా నుంచే కీలకమైన ముప్పు ఏర్పడిందనే విషయాన్ని తాము గుర్తించామని పేర్కొన్న నాటో ఈ దిశలో సోమవారం బ్రసెల్స్‌లో నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన భేటీలో చైనాపై మండిపడుతూ ప్రకటన వెలువరించాయి. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ సహా 30 దేశాధినేత సమావేశంలో చైనా వైఖరితో తలెత్తిన పరిణామాలు ప్రపంచ మానవాళికి, సాధారణ జనజీవన వ్యవస్థకు ప్రమాదకారి అయినట్లు నాటో తెలిపింది. ప్రపంచ వ్యవస్థను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం తీవ్రస్థాయి అంశం అని తెలిపింది. చైనా వాణిజ్య, సైనిక, హక్కుల అణచివేత పద్ధతులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త సంఘటిత శక్తిని రూపొందించుకోవల్సి ఉందని నాటో భేటీ తరువాత వెలువరించిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.

చైనా కేవలం తన స్వీయ ప్రయోజనాల దిశలోనే సంకుచిత ధోరణితో వ్యవహరిస్తోంది. దీనితో పద్ధతులునియమ నిబంధనలతో కూడిన ప్రస్తుత ప్రపంచ క్రియాశీలక గమన వ్యవస్థకు భంగం వాటిల్లుతోందని హెచ్చరించారు. ఇటీవలే బ్రిటన్‌లో జి 7 దేశాల సదస్సులో కూడా చైనా ధోరణిని ఖండించి సంయుక్త ప్రకటన వెలువరించారు. చైనా హక్కులను కాలరాస్తోంది. ఈ దేశపు వాణిజ్య, వ్యాపార దూకుడు పద్ధతులు ప్రపంచానికి నష్టం కల్గిస్తున్నాయని తీవ్రస్థాయిలో నాటో మండిపడింది. చైనా చర్యలతో పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజనాలు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయని అమెరికా కూటమి దేశాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ హయాంలో నాటో కూటమి ప్రభావం పెద్దగా కన్పించలేదు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు బైడెన్ హయాంలో చైనా వైఖరిని ఖండిస్తూ తొలిసారిగా తీవ్రస్థాయి ప్రకటన నాటో వేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్జెన్ బర్గ్ సంయుక్త ప్రకటనకు ముందు విలేకరులతో మాట్లాడారు. చైనా రష్యాలు ప్రపంచానికి తీవ్రస్థాయి సవాళ్లను విసురుతున్నాయని అన్నారు. చైనా క్షిపణులు ఇతరత్రా ప్రమాదాల బారి నుంచి ఎదుర్కొవడానికి అంతా సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఐరోపా దేశాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటామని అంతకు ముందు బైడెన్ హామీ ఇచ్చారు.

బూచిగా చూపొద్దు ః చైనా
ప్రగతిపై వేరే కోణం వద్దు

నాటో దేశాల ప్రకటన దురుద్ధేశపూరితంగా ఉందని చైనా ఎదురు జవాబు ఇచ్చింది. ఐరోసా సమాఖ్యలోని చైనా దౌత్యకార్యాలయ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. చైనా అభివృద్థిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, దీనిని వేరే కోణంలో చూసుకుంటే ముప్పుగానే అన్పిస్తుందని తెలిపారు. చైనా హక్కులు లక్షాలను ఈ బృందం స్వీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తూ ఇప్పటికి అప్పటి ప్రచ్ఛన్న యుద్ధం పరిస్థితిని కావాలనే కొనసాగిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. రాజకీయ వక్రీకరణలకు దిగడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని, నాటో ధోరణిని తాము చైనా అధికారికంగా కౌంటర్ ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News