Friday, April 26, 2024

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు

- Advertisement -
- Advertisement -

Man arrested for job fraud in Nalgonda

నల్లగొండ: నిరుద్యోగ యువతీ, యువకులకు తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి పులువురిని మోసం చేసిన ముఠాను అరెస్టు చేసినట్లు నల్లగొండ టూటౌన్ సిఐ నిగిడాల సురేష్ తెలిపారు. నలుగురు వ్యక్తుల ఈ ముఠా మాయమాటలు చెప్పి పలువురు నిరుద్యోగుల నుండి ఇప్పటి వరకు సుమారు రూ.20లక్షలు వసూలు చేశారని చెప్పారు. ఖమ్మం జిల్లా సారపాకకు చెందిన లక్కు శ్రీకాంత్‌రెడ్డి, నల్లగొండకు చెందిన మేడేబోయిన వెంకన్న, మెదక్ జిల్లా సంగాయిపేటకు చెందిన వంగాల వెంకట్రామిరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన మోహన్‌లతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నల్లగొండకు చెందిన లింగసామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని లోతుగా విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.3.40లక్షల నగదు, ఒక టాటా ఎస్ వాహనాన్ని స్వాధినం చేసుకొని సీజ్ చేయడం జరిగిందని, వీరందరిని గురువారం కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ తెలిపారు.

అభినందించిన డిఎస్పి వెంకటేశ్వర్‌రెడ్డి…

కేసు విచారణలో ఎస్సై నర్సింహారావు, వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ తదితరులు సమర్థవంతంగా పనిచేసి నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా పని చేసిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ రాజు, రాము, ఇతర సిబ్బందిని నల్లగొండ డిఎస్పి వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నిరుద్యోగులు ఇలాంటి వ్యక్తుల మాయమాటలకు మోసపోవద్దని, ఇలా ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Three arrested for job fraud in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News