Friday, May 10, 2024

రేపు చైనా అంతరిక్షకేంద్రానికి ముగ్గురు వ్యోమగాములు

- Advertisement -
- Advertisement -

Three astronauts to China space station tomorrow

బీజింగ్ : ప్రస్తుతం భూకక్ష్య లోని చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చైనా ముగ్గురు వ్యోమగాములను ఎంపిక చేసింది. ఈ ముగ్గురూ వాయువ్య చైనా లోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2 ఎఫ్ వాహక రాకెట్‌తో షెంజొయు 14 అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షానికి ఆదివారం బయలుదేరనున్నారు. చెన్‌డాంగ్, లియు యాంగ్, కై జుజే అనే ఈ ముగ్గురు వ్యోమగాములు తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అక్కడ ఆరు నెలలు ఉంటారు. ఇంతకు ముందు ఒక మహిళా వ్యోమగామితో సహా ముగ్గురు వ్యోమగాములు చైనా అంతరిక్ష కేంద్రం లో ఆరు మాసాలుండి కీలకమైన సాంకేతిక భాగాలను తనిఖీ చేయగలిగారు. గత ఏప్రిల్‌లో వీరు తిరిగి భూమికి చేరుకున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే అంతరిక్ష కేంద్రం స్వయంగా ఉన్న దేశం చైనా అవుతుంది. రష్యా నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) కు చైనా అంతరిక్ష కేంద్రం పోటీ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News