Home ఖమ్మం కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడిన కారు

కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడిన కారు

Three Members dead in Car accident

ఖమ్మం: కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడిన సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్ర శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టిఎస్ 28 హెచ్ 7640 అనే నంబర్ గల కారు అదుపు తప్పి కాలువలో బోల్తాపడడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.