Sunday, April 28, 2024

రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

- Advertisement -
- Advertisement -

Thunderstorm rainfall warning for Telangana

హైదరాబాద్: రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం , నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి,మెదక్, వికారాబాద్ జిల్లాలో ఒకటి రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంటీరియర్ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టం నుంచి 0.9కి మీ వరకు ఉపరితల ద్రోణి బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం తక్కువ ఎత్తులో గాలులు దక్షిణ, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, హైదరాబాద్ పరిధిలో మాత్రం అతినీలలోహిత కిరణాల ప్రభావం అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News