Tuesday, April 30, 2024

తిరుమలలో ముగిసిన ధార్మిక సదస్సు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది. చివరి రోజున పలువురు స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. చిన్నపిల్లలకు భగవంతుని పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి ఊరిలో వారానికి ఒకసారి ప్రవచనాలు, ప్రార్థన గురించి తెలపాలని ఉడిపి మఠానికి చెందిన శ్రీ వేదవర్ధన స్వామి అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించడానికి కృషి చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కృతజ్ఞతలు తెలిపారు. ధర్మ ప్రచారంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యామ్నాయం లేదని శ్రీరంగానికి చెందిన పాండరికపురం ఆశ్రమం పీఠాధిపతి శ్రీ పరవకొట్టై చిన్న ఆండవన్ శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్ అన్నారు.

ఈ సేవ మరింత విజయవంతం కావాలని, పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలకు నైతిక పోటీలు నిర్వహించి మన సంప్రదాయాలను కొనసాగించి వేదాలను భారతదేశమంతటా ప్రచారం చేయాలన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. హిందూ సనాతన ధర్మాన్ని అన్నిచోట్లా ప్రచారం చేయాలిలని, కర్ణాటలోని చిత్రపూర్ మఠానికి చెందిన శ్రీ విద్యేంద్ర తీర్థ స్వామీజీ అన్నారు.సమాజానికి సేవ చేయడం వల్ల మనకు పుణ్యఫలం దక్కుతుంది. ఇలాంటి ధార్మిక సదస్సు నిర్వహిస్తున్న టిటిడి పాలకమండలి అధ్యక్షులకు, ఈవో గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు.శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, సంస్కృత సుభాషితాలు ప్రత్యేకంగా బోధించాలి. పాశ్చాత్య సంస్కృతి పెచ్చరిల్లకుండా చర్యలు తీసుకోవాలి. టిటిడి ధార్మిక, సేవా కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించాల్సిన అవసరం ఉందని వారణాసికి చెందిన శృంగేరి బ్రహ్మానంద మఠం చెందిన శ్రీ సదాశివ ఆశ్రమ స్వామిజీ అన్నారు. టిటిడి వేద పరిరక్షణ చేయవలసిన ఆవశ్యకత ఉందని, బెంగుళూరులోని రాఘవేంద్ర మఠానికి చెందిన శ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి, వేద పరిరక్షణే ధర్మ పరిరక్షణ అని,  గోసంరక్షణ ఆవశ్యకత చాలా ఉందని అన్నారు. ప్రతి గ్రామంలో దేవాలయాలు నిర్మించాలి. సంస్కృత భాష అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Swamiji

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News