Sunday, April 28, 2024

కోవిడ్ ప్రోటీన్ విరుగుడు కణజాల సృష్టి

- Advertisement -
- Advertisement -

Tissue creation for Covid protein antidote

 

యంగ్‌సైంటిస్టు పోటీలో విజేత అనిక

పాతికవేల డాలర్ల బహుమతి

3 ఎం కంపెనీ నుంచి శిక్షణ

హుస్టన్ : ప్రస్తుత కోవిడ్ దశలో భారతీయ సంతతికి చెందిన ఓ చిన్నారి బాలిక అమెరికాకు ఆశాకిరణం అయింది. కరోనా వైరస్‌కు తగు సామర్థ్యపు చికిత్సను కనుగొన్న ఈ బాలిక అనికా చేబ్రోల్ (14 ఏండ్లు) ఇందుకు గాను 25000 డాలర్ల ప్రోత్సాహక బహుమతిని పొందింది. కోవిడ్‌కు ట్రీట్‌మెంట్ మార్గాల ఆవిష్కరణకు యంగ్ సైంటిస్టు ఛాలెంజ్ పిలుపు నివ్వగా ఇందులో పాల్గొన్న అనికా తన ఘనతను చాటుకుంది. కరోనా వైరస్‌లో ఉండే ప్రోటీన్‌ను కట్టడిచేసే కణజాలాన్ని అనిక కనుగొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనితో కరోనాకు తగు వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు వీలేర్పడింది. ఆమె రూపొందించిన కణజాలంతో వైరస్ వ్యాప్తి నిరోధించబడుతుంది. టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో అనికా ఎనిమిదవ తరగతి చదువుతోంది. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన మాధ్యమిక స్కూలు సైన్సు పోటీలో 3 ఎం యంగ్ సైంటిస్టు పోటీ అత్యంత గౌరవప్రదమైనది. మిన్నిసోటాకు చెందిన ప్రఖ్యాత అమెరికా కంపెనీ 3ఎం బాలబాలికలలో శాస్త్రీయ ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ఈ యంగ్ సైంటిస్టు పోటీని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.

గత ఏడాది అనికా తీవ్రస్థాయి ఇన్‌ఫ్లూయెంజాకు గురయ్యింది. దీనికి సరైన చికిత్సను కనుగొని తీరాలనే సంకల్పంతో పలు విధాలుగా ఈ చిన్న వయస్సులోనే అధ్యయనం చేస్తూ వచ్చింది. అయితే ఈ దశలోనే అమెరికాను కూడా కోవిడ్ 19 కుదిపేయడంతో ఈ బాలిక ఈ వైరస్ చిక్సితకు తగు విధానాన్ని రూపొందించేందుకు కృషి చేసింది. ఆమె కరోనా చికిత్సకు అవసరం అయిన మందును కనుగొంది. 3 ఎం నిర్వహించిన ఈ యంగ్‌సైంటిస్టు పోటీ తనలోని తపనకు మరింత పట్టుదలను కల్పించిందని అనిక తెలిపింది. ప్రాధమికంగా ఆమె తయారుచేసిన మందుకు తగు విధమైన ఇన్ విట్రో, ఇన్ వివో పరీక్షలు పూర్తి కావల్సి ఉందని, అప్పుడే పూర్తిస్థాయిలో డ్రగ్ రూపొందుతుందని అనిక తెలిపారు. ఇందకు తాను 3ఎం సైంటిస్టుల నుంచి నేర్చుకోవల్సింది ఎంతో ఉందని పేర్కొంది. యంగ్‌సైంటిస్టు పోటీలో తుదిజాబితాలో చేరిన పది మందిలో ఒకరైన అనికకు పాతిక వేల డాలర్లతో పాటు 3 ఎం కంపెనీ నుంచి తగు శిక్షణను కూడా పొందుతుంది. అమెరికాలో 3ఎం కంపెనీ ఆరోగ్య పరిరక్షణ, శాస్త్రీయ అంశాలు, సృజనాత్మక పరిశోధనల వంటి రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యంగ్‌సైంటిస్టు అవార్డుకు తాను ఎంపిక కావడం గర్వకారణంగా ఉందని చేబ్రోలు తెలిపారు. ఇది తనకు అపార అవకాశాలు తెచ్చిపెట్టిందని తెలిపారు. మనిషి నిత్యజీవితంలో సైన్స్ అన్నింటికి ప్రాతిపదికగా నిలిచిందని , యావత్తూ విశ్వానికి సైన్స్ మార్గదర్శకంగా ఉందని తెలిపారు. శాస్త్రాన్ని , విజ్ఞానాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకునేందుకు తనకు సమయం పడుతుందని అన్నారు. తనకు వైద్య పరిశోధకురాలు, ప్రొఫెసర్ కావాలనే లక్షం ఉందని యంగ్ సైంటిస్టు అయిన అనిక తెలిపారు. తన తాతయ్య కెమిస్ట్రీ ప్రొఫెసర్ అని, ఆయన ప్రోత్సాహం వల్లనే తన ఆవిష్కరణకు వీలేర్పడిందని అనిక పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News