Monday, April 29, 2024

‘ఫైటర్’లో బాలీవుడ్ స్టార్..

- Advertisement -
- Advertisement -

యువ సంచలనం విజయ్ దేవరకొండ కలల చిత్రం ‘ఫైటర్’. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ ఎంట్రీకి ఇది ఖచ్చితంగా మంచి బేస్ ఇస్తుందని అతడి నమ్మకం. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి పాన్ ఇండియా అప్పీల్ ఉండడంతో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని మెజారిటీ పార్టీను ముంబయ్‌లో చిత్రీకరించారు. ఈ కథ నచ్చి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ చేకూరింది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఇందులో నటించడానికి అంగీకరించాడట. ఇందులో ఫ్లాష్‌బ్యాక్‌లో విజయ్ తండ్రిగా సునీల్ శెట్టి నటిస్తాడని… ఆయనది డాన్ క్యారెక్టర్ అని తెలిసింది. ఈ సినిమాలో ఆయన పాత్ర 15 నిమిషాల పాటు ఉండవచ్చని సమాచారం. ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంతో కష్టపడి సిక్స్‌ప్యాక్ కూడా చేశాడు.

Sunil Shetty to play Key role in Fighter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News