Monday, April 29, 2024

వరదల గాయాలకు రూ. 550 కోట్లు

- Advertisement -
- Advertisement -

CM KCR key statement on flood relief

 

మునిగిన ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం

వరదల సహాయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన

పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు రూ.లక్ష,
పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు
నేటి నుంచే పంపిణీ చేయాలని ఆదేశం
200 నుంచి 250 బృందాలతో సాయం
మంత్రులు, ఎంఎల్‌ఎలు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలి
సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరివిగా విరాళాలివ్వండి
రూ. 10 కోట్ల సాయం ప్రకటించిన తమిళనాడు
సిఎం పిలుపుకు స్పందించి తక్షణం రూ.10 కోట్లు ప్రకటించిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ
2 కోట్లు ప్రకటించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్
సహాయక చర్యలకు స్పీడ్ బోట్లు పంపిస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మన తెలంగాణ/హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట, నష్టాలకు గురయ్యారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. వా రిని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని ప్రకటించారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎంతో నష్టపోయారన్నారు. ముఖ్యంగా ఇళ్లలోకి వరద నీరు రావడం వల్ల బియ్యంతో సహ ఇతర ఆహార పదార్ధాలు పూర్తిగా తడిసిపోయాయన్నారు. ఈ నేపథ్యంలోవరద నీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికి రూ. 10వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఆర్ధిక సహాయం మంగవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని సిఎం వెల్లడించారు. కాగా వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు పూ ర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. అలాగే దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి, మళ్ళీ మాములు జీవన పరిస్థితులు నెలకొనే లా చూడాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశించారు.

పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ.550 కోట్లు తక్షణమే విడుదలల చేస్తుందని సిఎం కెసిఆర్ చెప్పారు. గడిచిన వందేళ్లలో ఎన్నడు రానంత భారీ వ ర్షం హైదరాబాద్ నగరంలో కురిసిందన్నారు. దీంతో ప్రజలు కష్ట, నష్టాలకు గురయ్యారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీలలో ఉండేవారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువ కష్టాల పాలయ్యారన్నా రు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అన్నారు. కష్టాల్లో ఉన్న పేదలకు సా యం అందించడం కన్నా ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వానికి మరోటి లేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి రూ. 10వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ ల్ జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి నేటి ఉదయం నుంచే ఆర్ధిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సి ఎం ఆదేశించారు.

ఇందుకోసం నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి అన్ని చోట్ల ఆర్ధిక సాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సిఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎంఎల్‌ఎలు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. నష్టపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నాసరే…లక్షల మందికైనా సరే సాయం అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం చెప్పారు. కాబట్టి బాధిత కుటుంబాల వివరాలు అధికారులకు చెప్పి, సాయం అందించాలని సిఎం కోరారు. ఇందులో టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా సహాయ కార్యక్రమంలో పాల్గనాలని, బాధితులకు అండగా ఉండాల సిఎం పిలుపునిచ్చారు.

రూ. 550 కోట్లు విడుదల

కాగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరద బాధిత పేదలకు సాయం అందించేందుకు ఆర్ధిక శాఖ రూ.550 కోట్లను మున్సిపల్ శాఖకు విడుదల చేసింది.

రూ.10 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించిన తమిళనాడు

వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి రూ.10 కోట్లు ఆర్ధిక సాయాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం సిఎం కెసిఆర్‌కు ఒక లేఖ పంపారు. దీనిపై సిఎం కెసిఆర్ స్పందిస్తూ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నగదుతో పాటు బ్లాంకెట్లు, చద్దర్లు, ఇతర సామాగ్రి కూడా పంపుతామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదారంగా ముందుకు వచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి, సిఎం పళనిస్వామికి, ఆ రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

సిఎంఆర్‌ఎఫ్‌కు భారీగా విరాళాలు అందించండి : కెసిఆర్ విజ్ఞప్తి

రాష్ట్రంలో భారీవర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార వేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఉదారత చాటాలని ఆయన కోరారు. ఇందుకుగానూ సిఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందించాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News