Sunday, April 28, 2024

వరదలపై బురద రాజకీయాలొద్దు

- Advertisement -
- Advertisement -

Minister KTR Review on flood At GHMC headquarters

 

ప్రతిపక్షాలు మరీ నీచంగా వ్యవహరిస్తున్నాయ్

ప్రభుత్వం చేసే ప్రకటననే విశ్వసించండి
నగర చరిత్రలో అతిపెద్ద
రెండో వర్షపాతం ఇప్పుడు నమోదైంది
లోతట్టు ప్రాంతాల ప్రజలు
పునరావాస కేంద్రాలకు వెళ్లాలి
ప్రాథమిక అంచనా ప్రకారం
రూ.670 కోట్ల నష్టం
జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో
మంత్రి కెటిఆర్ సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : వరదలపై కొన్ని రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్ప ష్టం చేశారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలనే విశ్వసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అనేక కష్ట, నష్టాల్లో ఉన్నారన్న విషయా న్ని కూడా విస్మరించి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు ఆదుకోవాల్సి న తరుణంలో కూడా నీచమైన రాజకీయాలు చే యడం సిగ్గుచేటని విమర్శించారు. వందేళ్ల తరువాత రెండో అతిపెద్ద వర్షపాతం హైదరాబాద్ నగరంలో నమోదు అయిందన్నారు. దీని కారణంగానే పలు ప్రాంతాల్లో జలమయం అయ్యాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలను ఆదుకునేందుకు రాత్రింభవళ్ళు శ్రమిస్తోందన్నారు. ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెంది విశ్వనగరంగా ఎదిగిన నగరాల్లో ఒక్కసారిగా అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో కూడా ప్రజలకు సమస్యలు తప్పలేదన్నారు.

ప్రకృతి, ప్రభుత్వాలు, మానవ తప్పిదాల కారణం గా హైదరాబాద్‌లో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. దీనిని శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలుగా యత్నిస్తోందన్నారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడడమే తమ ముందున్న ప్రధాన లక్షమన్నారు. ఈ దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరద సహాయక, పునరావాస చర్యలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకుగా నూ ప్రత్యేకంగా 80మంది సీనియర్ ఆఫీసర్లను నియమించామన్నారు. 15రోజులపాటు వారంతా వరద సహాయక పునరావాస విధుల్లోనే ఉంటారన్నారు. వరద సహా య పునరావాస చర్యలపై సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధా న కార్యాలయంలో మంత్రి కెటిఆర్ సమీక్ష చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, ఇవిడిఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరు లు హాజరయ్యారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, గత పది రోజులుగా ఎడ తెరిపి లేకుండా భారీ వర్షాల వల్ల జిహెచ్‌ఎంసి పరిధిలో దాదాపు 37వేల కుటుంబాలు వరద ముంపుకు గురుయ్యాయని తెలిపారు. వారందరికి సిఎం రిలీఫ్ కిట్ కింద రూ. 2800 విలువైన నిత్యవసర వస్తునులు, మూడు బ్లాంకెట్లు అందిస్తున్నామన్నారు. రానున్న మూడు రోజులు భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో శిథిల, ప్రమాదకర, నీళ్లు నిలిచిన ఇళ్లను ఖాళీ చేయాలని ఆయన మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కు పునరావాస కేంద్రాలకు తరలించుకుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. కాగా వరద సహాయంగా తక్షణమే రాష్ట్రానికి రూ.1350 కోట్లు ఇవ్వాలని ప్రధాన మంత్రిని ఇప్పటికే సిఎం కెసిఆర్ కోరారన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖతో సోమేశ్‌కుమార్ ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారన్నారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామన్నారు.

రూ.670 కోట్ల నష్టం

వరదల వలన నగరంలో రూ.670 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు, నాలాలు ఇతర ఆస్తులకు నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనావేశామని మంత్రి కెటిఆర్ తెలిపా రు. వరద సహాయక పనులపై ఇప్పటికే రూ.60 కోట్లు ఖర్చు చేశామన్నారు. వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతా ల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సహాయ, పునరావాస చర్యలను పెద్దఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. ఈ సహాయ పునరావాస పనులలో జిహెచ్‌ఎంసి మాన్సూన్ ఎమర్జెన్సీ, రెవిన్యూ, పోలీసు, డిఆర్‌ఎఫ్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా వేల మందిని సహాయక కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. సహాయ పునరావాస కేంద్రాల్లో ఉచిత భోజన వసతి కల్పించామన్నా రు. పునరావాస కేంద్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. వరద ముంపు ప్రభావానికి గురైన 37 వేల కుటుంబాలకు సిఎం రిలీఫ్ కిట్‌లను అందిస్తున్నామన్నారు. ప్రతి సిఎం రిలీఫ్ కిట్‌లో రూ.2800 విలువైన నిత్యవసర వస్తువులు, మూడు బ్లాంకెట్లు అందిస్తున్నామన్నారు.

స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం స్పెష ల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. అలాగే వ్యాధులు ప్రబలకుండా మందులను స్ప్రే చేస్తున్నామన్నారు. అలాగే భవన నిర్మాణ, శిథిలాల వ్యర్ధా లను సైతం యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నామన్నారు వరదల వల్ల దురదృష్టవశాత్తు జిహెచ్‌ఎంసి, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మొత్తం 33మంది చనిపోయారని ఆయన వెల్లడించారు. వారిలో 29 మందికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాగా ప్రభుత్వం అందజేసిందన్నారు. ఆకస్మికంగా వచ్చివ వరదలతో గుర్రం చెరువు, పల్లె చెరు వు, అప్పా చెరువులు తెగిపోయాయని ఆయన తెలిపారు.

920 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల పునరుద్ధరణ

భారీ వర్షాలు వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 920 ట్రాన్స్ ఫార్మర్లను పునరుద్ధ్దరించామన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో తిరిగి వరద నీరు వచ్చి చేరినందున ఎల్‌బినగర్, చార్మినార్ జోన్లలో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందన్నారు. ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే విద్యుత్ పునరుద్ధరిస్తున్నామన్నారు.

నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షపాతం

1908 సెప్టెంబర్ 28వ తేదీన సింగిల్ డేలో 43 సెంటిమీటర్ల వర్షపాతం హైదరాబాద్‌లో నమోదు అయిందన్నారు. 1916లో 140 సెంటిమీటర్ల వార్షిక వర్షపాతం నమోదైందన్నారు. హైదరాబాద్ నగరంలో వార్షిక సగటు వర్షపాతం 77.9 సెంటిమీటర్లు అని మంత్రి కెటిఆర్ తెలిపారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికే 120 సెంటీమీటర్ల సగటు వర్షం పాతం నమోదు అయిందని ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం ఇంకా వర్షాలు పడుతున్నందున రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు. ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా 32సెంటిమీటర్ల వర్షాపాతం నమోదైందన్నారు. కుములోనింబస్ మోఘాల వల్ల ఆకాశం చిల్లుపడినట్లుగా కుండపోతగా వర్షం పడుతోందన్నారు.

మరో 30 బోట్లను సమకూర్చుకుంటున్నాం

జిహెచ్‌ఎంసి, డిఆర్‌ఎఫ్ విభాగంలో ఉన్న 18బోట్లతో పాటు ఎపి, కర్నాటక నుంచి మరో 30 బోట్లను తెప్పిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీంతో భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సకాలంలో రక్షించేందుకు అవకాశముంటుందన్నారు. గత పది రోజుల నుంచి నానిన భవనాల పునాదాలు, గోడలు బలహీన పడి ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున పైఅంతస్తులలో ఉంటున్న కుటుంబాలు కూడా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఆయన సూచించారు. వరద ముంపు పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యల్లో భాగస్వాములు కావాలని నగరానికి చెందిన మంత్రులు, శాసనసభ్యు లు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఎన్‌జిఒలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు

వదర బాధిత కుటుంబాలను ఆదుకునేందుకతు తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల సహయాన్ని విరాళంగా ప్రకటించడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News