Wednesday, September 18, 2024

డిఎంకెకు సవాలు విసిరిని తమిళనాడు బిజెపి చీఫ్!

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో ప్రవాస కార్మికులపై దాడుల విషయంలో పోలీసులు తమిళానాడు బిజెపి చీఫ్ కె. అన్నామళైను బుక్ చేశారు. ఈ నేపథ్యంలో ‘దమ్ముంటే 24 గంటల్లో నన్ను అరెస్టు చేసి చూడండి’ అని ఆయన డిఎంకె ప్రభుత్వానికి సవాలు విసిరారు. పైగా తనపై తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. ‘మీరు (డిఎంకె ప్రభుత్వం) ప్రజాస్వామ్య గళాన్ని అణచివేయొచ్చని అనుకుంటున్నారా? తప్పుడు కేసులు బనాయిస్తారా? సామాన్య పౌరుడిగా నేను మీకు 24 గంటల సమయం ఇస్తున్నాను, వీలయితే అరెస్టు చేయండి’ అని అన్నామళై ట్వీట్ చేశాడు.

ఈ తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర సైబర్ క్రైమ్ డివిజన్ అతడిని హింసను రెచ్చగొడుతున్నందుకు, రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతున్నందుకు బుక్ చేసింది. తమిళనాడులో బీహార్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్న నేపథ్యంలో తమిళనాడులో పోలీసులు కార్యాచరణలోకి దిగారు. ఇదిలావుండగా ఉత్తరాది వారికి వ్యతిరేకంగా ఏడు దశాబ్దాలుగా డిఎంకె చేస్తున్న ప్రచారం తన ట్వీట్‌కు ప్రతిగా పోలీసుల ప్రతిస్పందన ద్వారా వెలుగులోకి వచ్చిందన్నారు. ‘ఏడు దశాబ్దాల కాలంలో వారు(డిఎంకె) ఏమి మాట్లాడారో దానికి సంబంధించిన వీడియో నా దగ్గర ఉంది. నేను ఫాసిస్టు డిఎంకెను దమ్ముంటే నన్ను అరెస్టు చేయాల్సిందిగా సవాలు విసురుతున్నాను’ అని అన్నామళై అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ఆయన ఇంకా ‘తమిళనాడులోని వలస కార్మికులపై తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అది నన్ను బాధిస్తోంది. తమిళులమైన మాకు ‘ప్రపంచం అంతా ఒక్కటే కుటుంబం’. మేము ఉత్తరాది వారిని వేరుగా చూడలేదు, వారిపై ద్వేషం లేదు’ అని ట్వీట్ చేశాడు.

తమిళనాడు పోలీసులు అన్నామళై మీదనే కాకుండా ‘బిజెపి బీహార్’ అనే ట్విట్టర్ అకౌంట్ ఉన్న వ్యక్తిపై కూడా ్ల 153, 153ఎ(1), 505(1)బి, ఐపిసి 505(2) కింద కేసు రిజిష్టరు చేశారు. బిజెపి ప్రతినిధి ప్రశాంత్ ఉమ్రావ్, ఇద్దరు జర్నలిస్టులు సహా నలుగురిపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నందుకు కేసులు బుక్ చేశారు. ‘తమిళనాడులో బీహార్ వలస కార్మికులపై దాడులు అంటూ తప్పుడు వీడియోలను సర్యూలేట్ చేసిన వారిని వదిలిపెట్టం’ అని తమిళనాడు డిజిపి శైలేంద్ర బాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News