Thursday, May 16, 2024

తమిళ పిల్లలు లెక్కల్లో వెనుకంజ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో తమిళనాడు విద్యార్థులు లెక్కల్లో వెనుకబడి ఉన్నారు. లెక్కలు తీసివేతలు కూడికలు, గుణింతాలకు సంబంధించిన న్యూమెరసీ తెలివితేటలపై జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా మండలి(ఎన్‌సిఇఆర్‌టి) ఓ అధ్యయనం నిర్వహించి రాష్ట్రాలవారిగా పిల్లల్లో ఈ ప్రతిభాపాటవాల గురించి నివేదిక వెలువరించింది. ఈ క్రమంలో తమిళనాడులో అత్యధికంగా పిల్లలు ఈ న్యూమెరసీలో తక్కువ మార్కులు పొందుతున్నారు. తరువాతి క్రమంలో అసోం, గుజరాత్ రాష్ట్రాల పిల్లలు లెక్కలలో రాణించలేకపోతున్నారని వెల్లడైంది. తరగతుల వారిగా పిల్లల్లో లెక్కల ప్రతిభ గురించి అధ్యయనం నిర్వహించారు. క్లాసు 3కు చెందిన విద్యార్థులలో కనీసం 37శాతం మంది ఈ కేటగిరిలో ఉన్నారు.

ఈ మేరకు పిల్లల్లో లెక్కల్లో పరిమిత విజ్ఞానం ఉంటోంది. వారి క్లాసునకు అనుగుణంగా లెక్కలు చేయడంలో వీరు కొంత మేరకే రాణిస్తున్నారని ఎన్‌సిఇఆర్‌టి తెలిపింది. ఇదే దశలో ఈ తరగతి స్థాయి పిల్లల విషయాన్ని తీసుకుంటే పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ పిల్లలు లెక్కలలో ఆరితేరి ఉన్నారు. అత్యంత సంక్లిష్టమైన ప్రశ్నలకు కూడా జవాబులు చెపుతున్నారు. ఎన్‌సిఇఆర్‌టి తరఫున దేశవ్యాప్తంగా పలు కేంద్రాలను ఎంచుకుని పిల్లల్లో గణిత పరిజ్ఞానం గురించి అంచనాలు వేశారు. అంకెలను గుర్తించి చెప్పడం, గణితాలకు వెళ్లడం వంటి వాటిలో పిల్లల ప్రతిభను అధ్యయనం చేశారు. ఈ క్రమంలో పిల్లలకు భాషలపై ఉన్న పట్టు గురించి కూడా అంచనాకు దిగారు. తమిళంలో చదివే పిల్లల్లో 42 శాతం మంది వరకూ అంకెలను గుర్తించి చదివే నేర్పులో వెనుకబడి ఉన్నారు. బాలురలో నిమిషానికి 16 పదాలను చదవగల్గుతున్నారు. అయితే ఇదే బాలికల విషయానికి వస్తే వారు నిమిషానికి 18 పదాలను అప్పచెప్పగల్గుతున్నారు.

TN Students Lowest Score in Numeracy: NCERT Survey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News