Sunday, April 28, 2024

బుధవారం రాశి ఫలాలు (13-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. విందు, వినోదాలు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. షేర్లు క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం – బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. మెలుకువ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ధనలాభం.

మిథునం –  రుణ వత్తిడుల నుండి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కొత్త వస్తు సేకరణ

కర్కాటకం – మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు లాభిస్తాయి. స్థలాల కొనుగోలు యత్నాలు.

సింహం – ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథుల నుండి శుభ ఆహ్వానాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఇంటాబయటా మీదే పై చేయి ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య – వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ధన లాభం.

తుల – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమైన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్తు సేకరణ.

వృశ్చికం – ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. వాహన యత్నాలు ఫలిస్తాయి.

ధనున్సు – వివాదాలకు దూరంగా వుండండి. కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఉద్యోగులలో స్థాన మార్పులు వుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

మకరం – ప్రయాణాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తీరుతాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.

కుంభం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు. కాంట్రాక్టులు లాభిస్తాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

మీనం – జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

 

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News