Wednesday, May 15, 2024

శుక్రవారం రాశి ఫలాలు(17-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వస్తు లాభం.

వృషభం – పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. వివాదాలకు దూరంగా వుండండి.

మిథునం –  మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం – పనులలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

సింహం – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

కన్య – దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూ, గృహ యోగాలు పొందుతారు. ముఖ్య నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

తుల – రుణాలు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. ఉద్యోగులకు, స్వల్ప స్థాన చలనం వుండును.

వృశ్చికం – అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. ఇంటాబయటా ఎదురైన చికాకులు తొలుగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. పనులలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వస్తు, వస్త్రా కొనుగోలు

ధనుస్సు – కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు.

మకరం – నూతన పరిచయాలు కలుగుతాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులు ఉన్నత స్థితిని అందుకొంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం.

కుంభం – ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా వుంటాయి. పనుల్లో జాప్యం జరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.

మీనం – పనులు పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News