Tuesday, May 14, 2024

మంగళవారం రాశి ఫలాలు(28-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో జాప్యం జరిగినా చివరకి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. ఆర్థికపరిస్థితి అనుకూలం.

వృషభం – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

మిథునం – భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రముఖులతో పరిచయాలు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన, గృహ యోగాలు పొందుతారు.

కర్కాటకం – ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి.

సింహం – ఇంటా బయటా అనుకూలం. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు.

కన్య – కుటుంబంలో ఏర్పడిన చికాకులు పరిష్కరించుకొంటారు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకొంటారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దూరప్రయాణాలు లాభిస్తాయి.

తుల – కొత్తమిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆస్తి లాభం పొందుతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. నూతన వస్తు సేకరణ.

వృశ్చికం – పెట్టుబడులలో తొందరపాటు వద్దు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా వుండును. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం.

ధనుస్సు – రుణవత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. ఉద్యోగాలలో స్థానమార్పులు వుంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదురైన సన్నిహితుల సాయం అందుకుంటారు. సోదరుల నుండి ధనలాభం.

మకరం – పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు, వినోదాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధన లాభం.

కుంభం – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానంనకు నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. వాహన సౌఖ్యం

మీనం – సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News