Saturday, April 27, 2024

పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…

- Advertisement -
- Advertisement -

KTR

 

పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి

వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి
పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి, కాలనీల వాసులకు శానిటేషన్ సిబ్బందిని పరిచయం చేసే కార్యక్రమం చేపట్టాలి
– మహబూబ్‌నగర్‌లో పట్టణప్రగతి ప్రారంభిస్తూ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాష్ట్ర మున్సిపాలిటీ, పరిశ్రమలు, ఐటి శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలపునిచ్చారు. అభివృద్ధే లక్షంగా ప్ర తి ఒక్కరూ ముందుకు వెళ్లినప్పుడే నిర్ధేశిత లక్ష్యాలు నెరవేరుతాయని ఆయన చెప్పారు. రాజకీయమైన అపేక్ష లేకుం డా పట్టణాభివృద్ధి జరగాలనేదే ప్రభుత్వ విధానమని కెటిఆర్ చెప్పారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండ వైట్ హౌజ్ ఫంక్షన్ హాల్ లో పట్టణ ప్రగతి ప్రణాళికలపై జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధి కోసం వార్డు ల వారీగా ప్రగతి ప్రణాళికలను రూపొందించుకుని పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. మౌలికసదుపాయాలు, పౌరసేవలు, కాలుష్యనివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చెప్పారు. పట్టణాల ను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక పారిశుద్ధ ప్రణాళికలను రూపొందించుకుని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రణాళిక ల ఆధారంగానే నిధులు, విధులు ఉంటాయని చెప్పా రు. పారిశుద్ధ ప్రణాళికలను 10 రోజుల్లో అమలు చేయాలని కెటిఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన తడిచెత్త, పొడిచెత్త బుట్టలను అనేక మంది ఉపయోగించడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. కొందరు ఆబుట్టలను బియ్యం, పప్పులకు వాడుకోవడం మంచి పద్ధతికాదని ఆయన చెప్పారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంతో రైతులకు సేంద్రియ ఎరువులు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో తడిచెత్త, పొడి చెత్త వేరు చేయని కుటుంబాల నుంచి చెత్తను తీసుకోకుండా సిబ్బంది నిరాకరించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో తడిచెత్త,పోడిచెత్త వేరుచేయడంతో మహిళ సంఘాలు నెలకు రూ.3లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారని చెప్పారు. చైనాలో కరోనా వైరస్ ఎంతోకల్లోలం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోని పక్షంలో స్వైన్ ప్లూ,డెంగ్యూ తదితర ప్రాణాంతక వ్యాధులు వచ్చేప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పట్టణాలవారీగా మున్సిపాలిటీ అధికారులు పరిచయం అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని కెటిఆర్ ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందితో కాలని వాసులకు పరిచయం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కాలనీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, అధికారులపై పూర్తి స్థాయి బాధ్యత ఉందన్నారు. మున్సిపాలిటీ బడ్జెట్‌లో పదిశాతం పచ్చదనం పెంచడానికి ఉపయోగించాలని కెటిఆర్ ఆదేశించారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను బతికించకుంటే పదవులు కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నూతన మున్సిపాలిటీ చట్టం మేరకు 75 గజాల వరకు స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ స్వీయధృవీకరణతో ఒక్కరూపాయితో అనుమతి తీసుకుని ఇళ్లు కట్టుకోవచ్చని చెప్పా రు. అలాగే 75 నుంచి 600గజాల లోపు స్థలం ఉన్నవారు కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో, మీసేవలో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందవచ్చని చెప్పారు.

స్వీయధృవీకరణలో తప్పులు జరిగితే 25 శాతం జరినామాలు కూడా ప్రభుత్వం విదిస్తుందని హెచ్చరించారు. వార్డుసభ్యులే కథానాయకులుగా మారి పురప్రజలకు సేవలందించాలని కెటిఆర్ ఆదేశించారు.పట్టణప్రగతి కార్యక్రమాలు దళిత, గిరిజన వాడల నుంచి ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లకా్ష్మరెడ్డి, శాసనమండలి సభ్యులు దామోదర్ రెడ్డి,కసిరెడ్డి, స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శివకుమార్, కలెక్టర్ వెంకట్‌రావు, మున్సిపాలిటీ ఛైర్మన్ కెసి.నరసింహులు, వైస్ ఛైర్మన్లు గణేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Towns should be idealized
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News