Saturday, May 18, 2024

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించినున్న ఎబివిపి సమావేశం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ రోడ్డు వైపు రాకూడదు, టివోలి ఎక్స్ రోడ్డు నుంచి ప్లాజా ఎక్స్ రోడ్డును పూర్తిగా మూసి వేయనున్నారు.

బోయిన్‌పల్లి, తాడ్‌బండ్ నుంచి టివోలి వెళ్లే వాహనాలను బాలమ్‌రాయ్ మీదుగా సిటిఓకు వైపు పంపిస్తారు.
కార్కానా, జెబిఎస్ నుంచి ఎస్‌బిహెచ్, ప్యాట్నీ వైపు వచ్చే వాహనాలను స్వీకర్ ఉపకార్ మీదుగా టివోలి, బ్రూక్‌బాండ్, బాలమ్ రాయ్, సిటిఓ వైపు మళ్లిస్తారు.
కార్కానా, జెబిఎస్ మీదుగా ఎస్‌బిహెచ్, ప్యాట్నీ డైవర్ట్ చేసి స్వీకర్,ఉపకార్ మీదుగా వైఎంసిఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ మీదుగా మళ్లిస్తారు.
ఎస్‌బిహెచ్ నుంచి వచ్చే వాహనాలను స్వీకర్ ఉపకార్, వైఎంసిఏ, సిటిఓ మీదుగా మళ్లిస్తారు.
ఆర్టిఏ తిరుమలగిరి, కార్కాన, మల్కాజ్‌గిరి, సఫిల్‌గూడ మీదుగా ప్లాజా వచ్చే వాహనాలను టివోలి మీదుగా స్వీకర్‌ఉపకార్, వైఎంసిఏ, బ్రూక్ బాండ్, బాలంరాయ్, సిటిఓ వైపు మళ్లిస్తారు.

రద్దీ ఉండే జంక్షన్లు….
చిలకలగూడ ఎక్స్ రోడ్డు, ఆలగడ్డ బావి ఎక్స్ రోడ్డు, సంగీత్ ఎక్స్ రోడ్డు, వైఎంసిఏ ఎక్స్ రోడ్డు, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, ఎస్‌బిహెచ్ ఎక్స్ రోడ్డు, ప్లాజా, సిటిఓ జంక్షన్, బ్రూక్‌బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, స్వీకర్ ఉప్‌కార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి ఎక్స్ రోడ్డు, తాడ్‌బండ్ ఎక్స్‌రోడ్డు, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్‌పల్లి ఎక్స్ రోడ్డు, రసూల్‌పుర, బేగంపేట జంక్షన్లలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని, ఈ జంక్షన్లను అవాయిడ్ చేయాలని పోలీసులు కోరారు.
పార్కింగ్ ప్రాంతాలు…
వరంగల్, హన్మకొండ, జనగాం, భూపాల్‌పల్లి, ములుగు, పాలమూరు, గద్వాల, నారాయణపేట, వికారాబాద్, నాగర్‌కర్నూలు, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, ఎల్‌బి నగర్, దిల్‌సుక్‌నగర్, ఉప్పల్, విద్యానగర్, కోటి, గోల్కొండ నుంచి వచ్చే వాహనాలను బైసన్ పోలో గ్రౌండ్‌లో నిలపాలి.

కరీనంగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఇందూర్, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, సంఘారెడ్డి, సిద్దిపేట నుంచి వచ్చే వాహనాలను దోబీఘాట్ వద్ద ఉన్న బ్రూక్‌బాండ్, లెఫ్ట్ టర్న్, టివోలి, స్వీకర్‌ఉపకార్ రైటర్న్, పరేడ్ గ్రౌండ్ ఈస్ట్ గేట్ వద్ద ఉన్న పది ఎకరాల్లో బస్సులు నిలపాలి.
కూకట్‌పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్‌నుంచి వచ్చే వాహనాలను ఓయూ పిజి కాలేజీ, సిటిఓ ప్లాజా, ఎస్‌బిఐ లెఫ్ట్ టర్న్ వద్ద ఉన్న రెండు ఎకరాల్లో నిలపాలి. తుఫాన్‌న్లు, కార్లు కంటోన్మెంట్ పార్కింగ్ గ్రౌండ్‌లో నిలపాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News