Wednesday, May 1, 2024

క్యాడర్ లేని పార్టీకి క్యారెక్టర్ లేని లీడర్ రేవంత్: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని కెటిఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల జీవన్ రెడ్డిలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ”క్యాడర్ లేని పార్టీకి క్యారెక్టర్ లేని లీడర్ రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కి కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్ ని సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడో అన్నారు. ద బోస్టన్ టైమ్స్ లో కాంగ్రెస్ ఘన కీర్తి వార్త కథనాలుగా వచ్చింది. అభివృద్ధికి కెటిఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే నువ్వు బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ వి. వాడు (బండి సంజయ్) అంటాడు తెలంగాణను ఆఫ్ఘసిస్తాన్, నైజీరియా అంటాడు.. దేశంలో బిజెపి చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మాకు తెలిసిన వైట్ వేరు.. దొంగలకు పెద్ద రేవంత్ కు తెలిసిన వైట్ వేరు. ముందు రాహుల్ గాంధీని పబ్ లకు వెళ్లకుండా ఆపు” అని తీవ్రంగా విమర్శించారు.

TRS MLA Jeevan Reddy fires on Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News