Thursday, April 25, 2024

బల్క్ డ్రగ్ ప్రాజెక్టు ఇస్తారా? లేదా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణాకు దక్కాల్సిన బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టును ఎందుకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని బిఆర్‌ఎన్ పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు శుక్రవారం పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బల్క్ డ్రగ్ పార్క్ అంశంపై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్షతపై మోడీ సర్కార్‌ను తూర్పారబట్టారు.హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు, వసతులు పుష్కలంగా ఉన్నా మంజూరీలో ఎందుకు నాన్చుతున్నారని నామా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బల్క్ డ్రగ్ పార్క్ కోనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణీత సమయంలోనే కేంద్రానికి దరఖాస్తు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా మంజూరీలో ఎందుకు వివక్షత చూపిస్తున్నారని ప్రశ్నించారు.

దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు, వసతులు కలిగిన హైదరాబాద్ నగరం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎంతో అనువైనదన్నారు. ఈ విషయంపై గతంలోనే సిఎం కెసిఆర్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారన్నారు. కరోనా వంటి కీలక సమయంలోనే దేశానికి హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున వ్యాక్సిన్లు సరఫరా చేసిన చరిత్ర తెలంగాణకు ఉందన్నారు. అయినప్పటికీ రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ ను మంజూరు చేసే విషయంలో కేంద్రం రెండు నాల్కుల ధోరణిని అవలంభిస్తుందని దుయ్యబట్టారు. కేంద్రం పార్లమెంట్ సాక్షిగా నేడు ఈ అంశంపై అబద్దపు ప్రకటన చేసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని విమర్శించారు.

కేంద్రం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు ఇస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదన్నారు. కానీ పార్లమెంట్లో సంబంధిత కేంద్ర మంత్రి చేసిన ప్రకటనలో మాత్రం తెలంగాణకు ప్రాజెక్టు ఇస్తున్నట్లు, పైగా ఇందుకోసం రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు అబద్దపు ప్రకటన చేయడం దేనికి నిదర్శనమని నామా ప్రశ్నించారు. ఈ విధంగా కేంద్రం
ఎందుకు వ్యవహరించాలన్నారు. పార్లమెంట్ లోపల ఒక రకంగా, లిఖిత పూర్వక స్టేట్‌మెంట్‌లో మరో రకంగా చెబుతున్నారన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నారా ? లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఫార్మా రంగానికి హైదరాబాద్ నగరం పెట్టింది పేరన్నారు. ప్రస్థుతం ఇతర దేశాల నుంచి బల్క్ డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న తరుణంలో బల్క్ డ్రగ్ ప్రోత్సాహాక పధకం కింద హైదారాబాద్‌లో ఈ ప్రాజెకు ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. హైదరాబాద్ లాంటి చోట ఈ ప్రాజెక్టును నెలకొల్పడం వల్ల ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. అలాగే ఇంత వరకు ఏఏ రాష్ట్రాలకు అనుమతి ఇచ్చి, నిధులు విడుదల చేశారో స్పష్టం చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News