Tuesday, April 30, 2024

కెటిఆర్ లాంటి నాయకుడు మాకు కావాలి: టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ

- Advertisement -
- Advertisement -

TRS NRI

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం తీవ్రంగా ఖండించింది. రేవంత్‌రెడ్డి అసత్యప్రచారానికి పాల్పడుతున్నారని టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం ఆరోపించారు. ఏనాడు రాష్ట్రానికి, దేశానికి అవసరమైన పని చేయని రేవంత్‌రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం విడ్డారంగా ఉందన్నారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకునిగా ఏనాడైన నిర్ణాణాత్మక సలహా రేవంత్‌రెడ్డి ఇచ్చారా అని కుర్మాచలం ప్రశ్నించారు. ఎంతసేపు లెక్కలు తప్ప బాధ్యతగల ప్రజాప్రతినిధిగా రేవంత్ రెడ్డి వ్యవహరించలేదన్నారు. కెటిఆర్ దేశానికి ఆదర్శమైన నాయకుడు.

ఎన్‌ఆర్‌ఐలుగా మేము అనేక దేశాల్లోని ప్రజలతో కలిసి పనిచేస్తాము.. వివిధ సందర్భాల్లో కెటిఆర్ లాంటి నాయకుడు మాకుంటే బాగుండేదని అనేకదేశాల్లో అంటుంటారని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం కెటిఆర్ తనఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా పనిచేయడం ఆయన విదేశాలకు వచ్చినప్పుడు తాము చూశామని చెప్పారు. కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా ఇతరుల పట్ల వ్యక్తిగతమైన ద్వేషాన్ని తగ్గించుకుని, బాధ్యత గల ఎంపిగా తెలంగాణ ప్రజలకు సేవలు చేయాలని కుర్మాచలం సలహా ఇచ్చారు. తెలంగాణ ప్రజలే కాకుండా ఎన్‌ఆర్‌ఐ సమాజమంతా కెటిఆర్ వెంటనే ఉందని ఆయన చెప్పారు. పనికి రాని, పసలేని ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి సరైన సమయంలో ప్రజలే గుణపాఠం నేర్పుతారని కుర్మాచలం చెప్పారు.

TRS NRI Denied Revanth Reddy Comments on KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News