Sunday, May 5, 2024

తప్పులు చేసే అధికారం మాకు లేదు: సిఎం

- Advertisement -
- Advertisement -

TRS Parliamentary Party Meeting In Pragathi Bhavan

హైదరాబాద్: నీటిపారుదలతో నేరపూరిత నిర్లక్ష్యంతో తెలంగాణకు నష్టం జరుగుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని కెసిఆర్ స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు అమలు చేశామన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన చేేనేత కార్మికులు సూరత్ లో ఉన్నారని చెప్పారు. చేనేత కార్మికుల సమస్యలపై అధికారులను సూరత్ కు పంపామని సిఎం తెలిపారు. రాష్ట్రంలో జౌళి పరిశ్రమను ప్రోత్సహిస్తే చేనేత కార్మికులు తిరిగివస్తామని చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఇటీవలే జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు వస్తున్నాయని చెప్పారు. చేనేతకు రాజకీయ ప్రాతినిధ్యం కోసం తర్వలో శుభవార్త చెప్తానని సిఎం పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ధనిక రాష్ట్రంగా మారుతామని చెప్పానని సిఎం గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన పరిణామాలు మీ కళ్లముందే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ఏం జరగాల్సిఉంది.. అన్నీ ప్రజలు అనుభవంలో ఉన్నాయని ఆయన తెలిపారు. చేయాలనుకున్న పనిని నిర్ధిష్టంగా అనుకుని ముందుకు పోతున్నాం. తప్పులు చేసే అధికారం మాకు లేదు.. చేతకాకుంటే ఇంట్లో ఉండాలన్నదే మా సిద్ధాంతం అని సిఎం పేర్కొన్నారు. ఏం చేస్తే బాగుంటుందో ఆ మార్గంలో పోతున్నామని కెసిఆర్ వెల్లడించారు. మిషన్ కాకతీయను బట్టే మా ఆలోచన ఎంటో అర్ధం చేసుకోవచ్చన్నారు. పదిమందికి అన్నం దొరికే వ్యవసాయరంగం బాగుపడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ధర్మం కోసం జరిగే పోరాటం కాబట్టి తెలంగాణ వస్తుందని మేం నమ్మినం అని చెప్పారు. చావు పరిష్కారం కాదనే స్లోగన్లు గోడల మీద చూసి బాధపడ్డాం. చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి జరగాలని సిఎం అభిప్రాయపడ్దారు. చేనేత సంఘాల పేరిట, పవర్ లూమ్స్ సంఘాల పేరిట రకరకాల ఇబ్బందులున్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News