Thursday, May 2, 2024

అతను రియల్ హీరో: మాజీ ఎంపి కవిత

- Advertisement -
- Advertisement -

Kalvakuntla-Kavitha

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ నేపథ్యంలో తినడానికి తిండిలేని నిరుపేదల కోసం చిన్నకారు రైతు మోర హన్మండ్లు తనకొడుకుల సూచనలమేరకు ఆర్థికసహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత అతనో రియల్ హీరో చాలా ఇన్‌స్పైరింగ్ అంటూ ట్వీట్ చేశారు.

ఆదిలాబాద్ జిల్లా లాండసాంగ్వి కి చెందిన మోర హన్మాండ్లు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో పండినపంటకు మంచి ధర లభించడంతో కోడుకుల సూచనల మేరకు రూ.50 వేలు లాక్‌డౌన్‌తో తినడానికి తిండిలేని నిరుపేదలకోసం సహాయం చేయనున్నట్లు తెలిపారు.ఈ మేరకు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ క్లిపింగ్‌ను కవితకు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ట్విట్టర్‌కు స్పందించిన కవిత మోరహన్మాండ్లును ప్రశంసిస్తూ అతను రియల్‌ హీరోగా అభినందించారు.

True Hero, Inspire me: Former MP Kavitha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News