Thursday, May 2, 2024

ట్రంప్ ‘స్వింగ్’ రారాజు

- Advertisement -
- Advertisement -

Trump leads in most of the swing states

 

ఆ రాష్ట్రాల్లో మళ్లీ డొనాల్డ్‌దే పైచేయి

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్ది ఉత్కంఠతను రేపుతున్నాయి. మొదట ఆధిక్యం ప్రదర్శించిన డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తరువాత వెనుకబడ్డారు. కానీ, వెనుకంజలో ఉన్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్ ట్రంప్ అనూహ్యంగా పుంజుకున్నారు. అధ్యక్ష పీఠానికి దగ్గర చేసే కీలకమైన ఫ్లోరిడాలో కూడా ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. అటు అధ్యక్ష అభ్యర్థి భవిత్యాన్ని తేల్చే స్వింగ్ స్టేట్స్‌లో చాలా వరకు ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. దీంతో మరోసారి ట్రంప్ స్వింగ్ కింగ్‌గా మారబోతున్నారు. అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, మిన్నెసోటా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, ఓహియో, విస్కాన్సిస్ రాష్ట్రాలు ఈ స్వింగ్ స్టేట్స్ జాబితాలో ఉన్నాయి. 2016లో కూడా కీలకమై ఏడు స్వింగ్ రాష్ట్రాలే ఆయనను అధ్యక్ష పీఠం ఎక్కించిన విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ట్రంప్ కంటే 30 లక్షల దాకా ఓట్లు ఎక్కువగా వచ్చాయి.. కానీ స్వింగ్ స్టేట్స్ ఫలితం పుణ్యమాని ట్రంప్‌కు ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ రావడంతో ట్రంప్ అధ్యక్షుడయ్యారు. ఈసారి కూడా ఆయన స్వింగ్ స్టేట్స్‌పైనే పూర్తిగా దృష్టిపెట్టారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత స్వింగ్ స్టేట్స్‌లోనే ఎక్కువగా ప్రచారం చేశారు. అప్పటి వరకు ఆ రాష్ట్రాల్లో బైడెన్‌దే పైచేయి అన్నట్టుగా సర్వేలు తేల్చిచెప్పినా, ట్రంప్ ప్రచారంతో హోరాహోరీగా పోరు సాగింది. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ట్రంప్ హవా నడుస్తోంది. వీటిలో విజయం సాధించిన అభ్యర్థి అమెరికా అధ్యక్షుడు అవుతారన్నది రుజువవుతూ వస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News