Sunday, April 28, 2024

బిసి గురుకుల జూనియర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

TS BC Gurukul Junior Entrance Test Results Released

సెప్టెంబర్ 4 లోగా కాలేజీల్లో చేరాలి
సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు

మనతెలంగాణ/హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్ష ఫలితాలు mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచామని సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు వెల్లడించారు. పరీక్ష ఫలితాలతో పాటు వారికి సీటు వచ్చిన కాలేజీ చిరునామా, ప్రిన్సిపల్ నెంబర్‌తో సహా వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు సెప్టెంబర్ 4వ తేదీ వరకు కళాశాల్లో చేరాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బిసి సోసైటీ పరిధిలో ఉన్న 138 జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం గత నెల 25న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 41,477మంది దరఖాస్తు చేసుకోగా 30,240 మంది హాజరయ్యారని మల్లయ్య బట్టు తెలిపారు. ఇంటర్ కోర్సుల్లో 11,230 మంది విద్యార్థులు, ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన వృత్తివిద్యాకోర్సుల్లో 1,010 మంది విద్యార్థులు చేరతారని ఆయన వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News