Thursday, May 2, 2024

సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్..

- Advertisement -
- Advertisement -

TS CMO has top popularity in Social Media

సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్
దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో మొదటి స్థానం
ఫేస్‌బుక్‌లో మూడవ స్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియా వేదికల ద్వారా రాష్ట్ర సిఎం కెసిఆర్ కార్యాలయం ప్రజలకు చేరువ కావడంలో సంచలనం సృష్టించింది. 2020 ఏప్రిల్ 1 నుండి 2021 మార్చి 31 మధ్య సేకరించిన గణాంకాల ప్రకారం అటు ట్విట్టర్లో, ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన జాబితాలో సిఎం కెసిఆర్ కార్యాలయం దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇక ఫేస్ బుక్ లో తెలంగాణ సిఎంవొ మూడో స్థానంలో నిలిచింది.
ట్విట్టర్లో మొదటి స్థానం
ట్విట్టర్‌లో తెలంగాణ సిఎంవొ మొదటి స్థానంలో ఉండగా ఇక రెండవ స్థానంలో హర్యానా సిఎంవొ, మూడవ స్థానంలో మహారాష్ట్ర సిఎంవొ, నాలుగవ స్థానంలో ఒడిశా సిఎంవొ, ఐదవ స్థానంలో మధ్యప్రదేశ్ సిఎంవొ అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభా కు ఉన్న ఫాలోవర్ ల ప్రాతిపదికన చూస్తే సిఎం కెసిఆర్ కార్యాలయం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఫాలోవర్స్ పరంగా గతేడాది పది లక్షల మైలురాయిని దాటిన తెలంగాణ సిఎంవొ ట్విట్టర్ ఖాతా ప్రస్తుతం 11.21 లక్షల మంది ఫాలోవర్స్ తో ముందు వరుసలో నిలిచింది.
ఫేస్‌బుక్ ః
ఫేస్‌బుక్ లోనూ ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగి తెలంగాణ సిఎంవొ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 3.5 కోట్ల జనాభా కి గాను ప్రతి వెయ్యి మందిలో 33.18 మంది తెలంగాణ సిఎంవొ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్నారు. ఇదే విధంగా మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ లోనూ ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సిఎంవొ ల జాబితాలో తెలంగాణ సిఎంవొమూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఫేస్ బుక్ లో తొలి స్థానంలో రాజస్థాన్ సిఎంవొ ఖాతా 26.8 1 లక్షల మంది ఫాలోవర్స్ తో ఉండగా, తెలంగాణ సిఎంవొ అకౌంట్ 8.43 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
సిఎంవొ సమాచారం ః
నెటిజెన్లు సిఎంవొ నుండి ఏమైనా తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సిఎం కెసిఆర్ నిర్వహించే క్యాబినెట్ సమావేశాలు, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాలు, పర్యటనల వివరాలు, ప్రభుత్వం తీసుకునే వివిధ నిర్ణయాలు ఎప్పటికప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ట్విట్టర్, ఫేస్ బుక్ సిఎంవొ ఖాతా ద్వారా సామాజిక మాధ్యమాలను నుంచి తెలుసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం వల్ల, సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలను తెలుసుకోవడం కోసం చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతున్నారు.

TS CMO has top popularity in Social Media

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News