Monday, May 6, 2024

టీకా కార్పొ’రూటు’

- Advertisement -
- Advertisement -

దేశంలోని తొమ్మిది బడా ప్రైవేట్ ఆసుపత్రులకే అత్యధిక, కోటా కోటికిపైగా డోసులలో 60లక్షల వాటా వాటిదే

న్యూఢిల్లీ : కార్పొరేట్ల రంగ ప్రవేశంతో దేశంలో కరోనా టీకాల పంపిణీలో కూడా అసమానతలు తీవ్రతరం అయ్యాయి. మే నెలలో మొత్తం వ్యాక్సిన్ల కోటాలో దాదాపు సగభాగం వ్యాక్సిన్లను 9 ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్స్ కొనుగోలు చేశాయి. ప్రధాన మెట్రోపాలిటిన్ సిటీలకు చెందిన ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ గ్రూప్‌లకే అత్యధిక శాతంలో టీకాలు దక్కడంతో ఇప్పటికే అస్తవ్యస్థంగా అంతకు మించి అసమానతల మయంగా ఉన్న దేశవ్యాక్సినేషన్ పాలసీ మరింత దెబ్బతిందని విమర్శలు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వం ముందు వ్యాక్సిన్ల పంపిణీ అంతా తమ పరిధిలోజరుగుతుందని తెలిపింది. అయితే ఎప్రిల్ మధ్యనాటికి దేశంలో టీకాలను మార్కెట్ పరిధికి వదిలిపెట్టింది. ప్రైవేటు సంస్థలు, ఆసుపత్రులు, రాష్ట్రాలు తమ అవసరాలకు తగు విధంగా నేరుగా వ్యాక్సిన్లను కొనుగోలు చేసుకోవచ్చునని విధాన నిర్ణయాన్ని కొత్తగా ప్రకటించింది. దీనితో అత్యవసరం అయిన టీకాల కొనుగోళ్ల విషయంలో కార్పొరేట్ ఆసుపత్రులు రంగంలోకి దిగాయి.

వ్యాక్సినేషన్‌లో ఎటువంటి అసమానతలు ఉండరాదని, వర్గతారతమ్యాలకు తావులేకుండా అందరికీ వ్యాక్సిన్లు అందితేనే దేశం వైరస్ విముక్తం అవుతుందని నిపుణులు చెపుతూ వస్తున్నారు. అయితే కేంద్ర విధాన నిర్ణయ మార్పుతో పరిస్థితి దయనీయం అయింది. టీకాల నిల్వలు కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ల గుప్పిట్లోకి వెళ్లాయని మే నెలలోఆయా ఆసుపత్రులు దక్కించుకున్న టీకా కోటాలతోవెల్లడైంది. టీకాలను ప్రభుత్వ నిర్ణేత ధరలకు ఈ ఆసుపత్రులు విరివిగా పొందేందుకు రాజకీయ పలుకుబడులను ఉపయోగించుకుంటున్నాయి. తరువాతిక్రమంలో డోస్‌ల విక్రయంలో పౌరుల అవసరాలను ఎంచుకుని ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకుంటున్నాయని నిర్థారణ అయినట్లు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేల ద్వారా కొన్ని వార్తాసంస్థలు తెలిపాయి. అపోలో, మాక్స్‌హెల్త్‌కేర్, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యపు హెచ్‌ఎన్ హాస్పిటల్ ట్రస్టు, మెడికా హాస్పిటల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, గోద్రేజ్, మణిపాల్ హెల్త్, నారాయణ హృదయాలయా, టెక్నో ఇండియా డమా వంటి ఆసుపత్రి దిగ్గజాలు మందులను ఎక్కువగా కొనుగోలు చేశాయి.

మే నెలలో మొత్తం కోటి 20 లక్షల వ్యాక్సిన్‌లు విడుదల కాగా వీటిలో ఈ తొమ్మిది ఆసుపత్రులకు దక్కింది దాదాపుగా 61 లక్షల డోస్‌లని స్పష్టం అయింది. ఇందులో అత్యధికంగా అపోలో ఆసుపత్రికి వెళ్లినట్లు తేలింది. ప్రభుత్వ ఆసుపత్రులకు అక్కడి పేద వర్గాల సంఖ్యకు అనుగుణంగా వెళ్లాల్సిన టీకా డోస్‌లు అత్యల్పం, అయితే పేరుమోసిన కొమ్ములు తిరిగిన సంస్థలకు చెందిన అత్యంత భారీ స్థాయి ఖరీదైన ఖర్చుభారపు ప్రైవేటు ఆసుపత్రులకు అత్యధికంగా టీకాలు పలుదారులలో చేరినట్లు స్పష్టం అయింది. టీకా నిల్వలు కార్పొరేట్ల చెంతకు చేరడంతో కీలక వ్యాక్సినేషన్ పథకం అసమగ్రరీతిలో మరింత చతికిల పడి, సెకండ్ వేవ్ నిరాటంకంగా థర్డ్‌వేవ్‌లోకి దారితీయడానికి వీలేర్పడిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

TS Corporate firms get permission for Covid Vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News