Sunday, April 28, 2024

ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

TS Eamcet Agriculture results released

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి ఫలితాలను శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షకు 80.85 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన 63,857 మంది అభ్యర్థులకుగాను, 59,113 మంది పాస్ అయ్యారు. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షల్లో 92.57 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఛైర్మెన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థుల ర్యాంకు కార్డులు https://eamcet.tsche.ac.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవంబర్ లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పాపిరెడ్డి వెల్లడించారు. ఎంసెట్ తొలి మూడు ర్యాంకులు బాలికలు కైవసం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఎపికి చెందిన గుత్తి చైత్యన్య సింధుకు ఎంసెట్ లో తొలి ర్యాంకు. మారెడ్డి సాయి త్రిషా రెడ్డి (సంగారెడ్డి)కి రెండో ర్యాంకు. తుమ్మల స్నికిత మూడోర్యాంకు, దర్శి విష్ణుసాయి 4వ ర్యాంకు సాధించారు. కాగా, అక్టోబర్ 6తేదీన ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 28న ఎడ్ సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.

TS Eamcet Agriculture results released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News