Thursday, May 2, 2024

ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

TS Eamcet Engineering Counseling Schedule Released

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు శుక్రవారం నాడు విడుదల చేశారు. విద్యార్థులు తమ ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని, ఈనెల 27న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలని, నవంబర్ 2న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. నవంబర్ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్, నవంబర్ 9, 10న వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. నవంబర్ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఉంటుందని, అలాగే నవంబర్ 14న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News