Wednesday, May 15, 2024

డ్వాక్రా మహిళలకు రూ.545కోట్లు వాపస్

- Advertisement -
- Advertisement -

TS government has decided to return Abhayahastham funds

21లక్షల మంది అభయహస్తం సభ్యులకు లబ్ధి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం నిధులను తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలు ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర అధికారులతో అసెంబ్లీలోని సమావేశపు గదిలో సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు రూ.545 కోట్ల రూపాయలను పొదుపు చేసుకున్నారు. 2009లో అభయ హస్తం కింద రూ.500 కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం ఈ పొదుపును మహిళలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, ఆసరా పథకం కింద మొదట్లో వెయ్యి రూపాయలు, ఇప్పుడు రూ.2016 మొత్తాన్ని పెన్షన్ గా ఇస్తున్నది. అప్పటి కంటే ఇప్పుడు అధిక మొత్తంలో పెన్షన్ వస్తున్నందున మహిళలు సైతం అభయహస్తం డబ్బులు తమవి తమకు కావాలని అడుగుతున్నారు. పొదుపు మహిళల కోరిక మేరకు ఆ నిధులను వారికి తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులు సంబంధిత పేదరిక నిర్మూలన సంస్థ వద్దే ఉన్నాయి. ఈ నిధులు మొత్తాన్ని వారికి తిరిగి ఇవ్వనున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఆ నిధిని ఆయా మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News