Thursday, May 2, 2024

హుజూరాబాద్ దళితబంధుకు మరి రూ.500కోట్లు

- Advertisement -
- Advertisement -

CM KCR Muharram greetings to the people

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో దళిత కుటుంబాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా హుజురాబాద్ దళితబంధు కోసం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే తొలి విడతలో రూ.500 కోట్లు విడుదల చేయగా, తాజాగా రెండవ విడతలో రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.2వేల కోట్ల విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్లు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు ప్రభుత్వం రూ.7.6 కోట్లు విడుదల ఇప్పటికే విడుదల చేసింది. ఇటీవల కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల శాలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకం ప్రారంభించారు. ఆ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులతో పాటు దళితబంధు ఎలక్ట్రానిక్ కార్డులను ముఖ్యమంత్రి కెసిఆర్ అందజేసిన విషయం తెలిసిందే.

TS Govt again release Rs 500 Cr for Dalit Bandhu Scheme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News