Friday, May 3, 2024

ఆర్‌డిఎస్ రైట్‌బ్యాంక్ పనులు నిలపండి

- Advertisement -
- Advertisement -

బోర్డుకు ఫిర్యాదు చేసిన తెలంగాణ
3న సీమ ఎత్తిపోతల పరిశీలన డౌటే
ఎపి స్పందనను బట్టి షెడ్యూల్ ఖరారు

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల పంపిణీలో తెలుగు రాష్ట్రాల మధ్యన జలజగడాలు రోజురోజుకు ముదురుతున్నాయి. కృష్ణానది జలాలను ఉపయోగించుకోవటంలో తెలంగాణ, అంధప్రదేశ్ రాష్టాలు పలు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాయి. అయితే వీటిపైన ఇరు రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు మీవంటే.. కాదు మీవే అని ఆరోపణలకు దిగుతూ ఒక రాష్ట్రంపైన మరోక రాష్ట్రం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపిణీలో సామరస్యపూర్వమైన పరిష్కారం చూపాల్సిన కేంద్రం తమకేమి పట్టనట్టుగా మౌనరాగం ఆలపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్యన నీటి పంపిణీ నియంత్రనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు కేంద్ర ప్రభుత్వం కృష్ణనదీ యాజమాన్య సంస్థను ఏర్పాటు చేసి అంతటితో తమ పనైపోయిందన్నట్టుగా చేతులు దులిపేసుకుంది. కృష్ణారివర్‌బోర్డు కూడా రెండు రాష్ట్రాల మధ్యన జల వివాదాల పరిష్కారం తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎపిలో పోతిరెడ్డి పాడు విస్తరణ పనులు, రాయలసీయ ఎత్తిపోతల పధకం పనులను ఏవిధమైన అనుమతులు పొందకుండానే చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుల లేఖ ప్రతులను ఏపికి పంపటం, తె లంగాణ ప్రభుత్వం అనుమతిలేకండానే పాలమూరు రంగారెడి పథకం పనలు చేపట్టిందని ఏపి చేసిన ఫిర్యాదు లేఖ ప్రతులను తెలంగాణకు పంపటం, రెండు రాష్ట్రాల లేఖలు, ఫిర్యాదు ప్రతులను అవసరాన్ని బట్టి కేంద్రానికి పంపటం వంటి తపాల శాఖ విధులకే పరిమితం అయిందన్న విమర్శలు ఎప్పటినుంచో వస్తున్నాయి. కృష్ణాబోర్డు వాటిని ఏమాత్రం పట్టించుకున్న ధాఖలేవంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం తనకు కృష్ణానదీజలాల వాటాలో అన్యాయం జరిగిందని వాటిని చక్కదిద్దాలని ఎప్పటికప్పుడు బోర్డు దృష్టికి తెస్తున్నా తగిన విధంగా బోర్డు నుంచి స్పందన కనిపించటం లేదంటున్నారు. కనీసం గత సంవత్సరం పంపిణీ మేరకు వినియోగించకుండా మిగిల్చిన వాటా నీటిని వచ్చే ఏడాది వినియోగించుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం పలు మార్లు బోర్డును కోరినా పట్టించుకోలేదు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బోర్డు వైఖరి ఇప్పుడే ఈ విధంగా ఉంటే ఇక విభజన చట్టం సాకుగా పెట్టి బోర్డును విశాఖపట్నం తరలిస్తే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యర్ధనలను ఏమాత్రం లేక్కలోకి తీసుంటుందన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి నామమాత్రంగానైనా చర్యలు తీసుకోవటం లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా సాగుతున్న పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు నిలిపివేయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోర్డకు, కేంద్రానికి చేస్తూ వచ్చిన ఫిర్యాదులు, విజ్ణప్తుల పట్లు కేంద్రం నాన్చుడు ధోరణి కనబరుస్తోంది. ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం కృష్ణరివర్ బోర్డు పరిధిలో కూడా స్పష్టత ఇవ్వలేకపోయింది. నీటి విడుదలకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా ప్రోటోకాల్ కూడా నిర్ణయించలేదంటున్నారు.
ఆర్‌డిఎస్ కుడి కాల్వ పనులు ఆపండి
కృష్ణానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్ర నదిపైన ఎపి ప్రభుత్వం రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ వద్ద కుడివైపు అనుమతులు లేకుండానే చేపట్టిన కాలువ పనులు నిలిపివేయించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ బుధవారం కృష్ణాబోర్డుకు లేఖరాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇంకా అవార్డు కానేలేదు. అమల్లోకి రాని బ్రిజేష్ తీర్పును అడ్డుపెట్టుకుని ఎపి ప్రభుత్వం 4టింఎంసిల సామర్దంతో కుడికాలువ పనులు చేపట్టింది.దీనిపై వెంటనే స్పందించాలని లేఖ ద్వారా నేరుగా బోర్డు ఛైర్మన్‌కు ఈఎన్‌సి మురళీధర్ ఫిర్యాదు చేశారు.
3న సీమలిఫ్ట్ పనుల పరిశీలన డౌటే
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించేందుకు బోర్డు జులై 3న క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లడం సందేహమే అంటున్నారు. కేంద్రం గట్టిగా ఆదేశిస్తే తప్ప బోర్డు ఈ దిశగా అడుగులు ముందుకు వేసే పరిస్థితి కనిపించటం లేదంటున్నారు. అక్రమప్రాజెక్టులపై వస్తున్న విమర్శలను ఏమాత్రం లెక్కచేయకుండా శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఎదురు దాడికి దిగుతున్న ఏపి బోర్డుకు ఫిర్యాదు చేసింది. గురువారం ఎపి సీఎం జగన్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కుతో చర్చించే అవకాశం ఉందంటున్నారు.
ఈ చర్చల అనంతరం కేంద్ర మంత్రి నుంచి ఆదేశాలు వచ్చాకే బోర్డు ఛైర్మన్ సీమ ఎత్తిపోతల పనుల పరిశీలనకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.

TS Govt complaint to Krishna Board on AP Project 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News