Wednesday, May 1, 2024

సిరినవ్వుల దళిత వదనం

- Advertisement -
- Advertisement -
TS Govt releases another Rs 500 crore for Dalit Bandhu
దళితబంధు కింద హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులకు నాలుగు యూనిట్ల వాహనాలు
పంపిణీ కరీంనగర్ కలెక్టరేట్‌లో చరిత్రాత్మక ఘట్టం కెసిఆర్ సంచలన నిర్ణయం దళితబంధు పథకం
ప్రారంభించిన నెలలోనే లబ్ధిదారులకు వాహనాలందించడం అభినందనీయం ఈ పథకానికి ఇంతవరకు
రూ.2వేల కోట్లు విడుదల హుజూరాబాద్ నియోజకవర్గంలోని 21 వేల దళిత కుటుంబాలకు లబ్ధి ప్రారంభం
రోజున తొలి విడతగా సిఎం కెసిఆర్ 15చెక్కులు అందజేశారు గురువారం నాడు నాలుగు యూనిట్ల కింద ఒక
కారు, రెండు ట్రాక్టర్లు, ఒక ట్రాలీ పంపిణీ చేశాం ఆర్థికంగా బాగుపడతామన్న విశ్వాసం దళితుల్లో కనిపించింది
ఇతర రాష్ట్రాలు ఈర్ష పడే విధంగా దళితబంధును అమలు చేస్తున్నాం అంబేడ్కర్ కలను సిఎం కెసిఆర్
నిజం చేస్తున్నారు నిన్నటి డ్రైవర్ నేటి వాహన యజమాని, గతంలోని గుమస్తా ట్రాలీ ఓనర్‌గా మారారు
హాజరైన రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బిసి సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్
TS Govt releases another Rs 500 crore for Dalit Bandhu
నిన్నటి డ్రైవరే నేటి ఓనర్
దళితబంధుకు ఇంతవరకు 2000 కోట్లు
09.08.2021 – రూ. 500 కోట్లు
23.08.2021 – రూ. 500 కోట్లు
24.08.2021 – రూ. 200 కోట్లు
25.08.2021 – రూ. 300 కోట్లు
26.08.2021 – రూ. 500 కోట్లు

 

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: దళితుల సంక్షేమానికి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా నిబద్ధ్దతతో పనిచేస్తుందని దీనికి చక్కని ఉదాహరణ దళిత బంధు పథకం అని, నిన్నటి వరకు ఒకరి దగ్గర డ్రైవర్‌గా పని చేసిన దళితుడు నేడు ఒక కొత్త వాహనానికి ఓనర్‌గా మరడం దళిత బంధు గొప్పతనాన్ని తెలియజేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో దళిత బంధు లబ్ధ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి దళిత బంధులో ఎంపికైన లబ్ధిదారులకు నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం దళిత బంధును కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఫైలట్ ప్రాజెక్టుగా ఈ నెల 16న ప్రారంభంచడం జరిందని, ఇదే నెలలో లబ్ధ్దిదారులకు వాహనాలందించడం అభినందనీయమని అన్నారు.

దళిత బంధు పథకానికి ఇప్పటి వరకు 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని 21 వేల దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందించి వారి ఆర్థికాభివృద్ధ్దికి ప్రభుత్వం మేలు కల్పిస్తుందని అన్నారు. మొదటి విడుతగా దళిత బంధు ప్రారంభోత్సవంలో 15 చెక్కులను సీఎం అందించారని , నాలుగు యూనిట్ల క్రింద గురువారం లబ్ధ్దిదారులకు 2 ట్రాక్టర్లు , ఒక ట్రాలీ, ఒక కారు అందింజేశామని మంత్రి తెలిపారు. దళిత బంధు ద్వారా ఆర్థికంగా అభివృద్ధ్ది చెందుతామన్న నమ్మకం ధైర్యం దళితుల్లో కనబడిందని తెలిపారు. రాష్ట్ర బిసి, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈర్ష పడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధ్దికి దళిత బంధు అమలు చేస్తుందని అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కన్న కళలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు.

నిన్నటి వరకు డ్రైవర్ ఉన్న అతను నేడు వాహన యజమానిగా, గతంలో గుమస్తా నేడు ట్రాలీ యజమానిగా మారడం దళిత బంధు గొప్పతనం అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఎండ్లు గడుస్తున్న దళితుల సంక్షేమానికి ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ దళితుల కోసం దళిత బంధు ప్రకటించడం అభినందనీయం అన్నారు. అంచేల వారీగా దళితులందరికి దళిత బంధు పథకం అమలు అవుతుందని మంత్రి గంగుల తెలిపారు. అంతకుముందు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ దళిత బంధు లబ్ధిదారులు దాసారపు స్వరూప రాజయ్య దంపతులకు ట్రాక్టర్, ఎలుక పల్లి కొమరమ్మ— కనకయ్య దంపతులకు ట్రాక్టర్, జి సుగుణ మొగిలి దంపతులకు ట్రాలీ, రాచపల్లి శంకర్ కు మారుతి కారు మంత్రులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ కర్ణన్, రవాణా శాఖ కమిషనర్ ఎం. చంద్ర శేఖర్ గౌడ్, ఈడి ఎస్సి కార్పొరేషన్ సురేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News