Sunday, April 28, 2024

మూడో దశపై ముందుచూపు

- Advertisement -
- Advertisement -

నోడల్ సెంటర్‌గా నీలోఫర్ ఆసుపత్రి
అదనంగా వెయ్యి బెడ్లు సిద్ధం
జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పిల్లల వార్డులు
మందుల కొరత రాకుండా ఇప్పటి నుంచే స్టాక్

మన తెలంగాణ/హైదరాబాద్: థర్డ్‌వేవ్ వస్తే నిలోఫర్ ఆసుపత్రిని నోడల్ సెంటర్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిఎస్ కూడా రెండ్రోజుల క్రితం ఆ ఆసుపత్రిని సందర్శించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడో వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే పలు రీసెర్చ్‌లు చెబుతుండటంతో నీలోఫర్‌లో పడకల సంఖ్యను పెంచానున్నారు. ప్రస్తుతం ఉన్న 1200 పడకలకు అదనంగా మరో వెయ్యి బెడ్లను సిద్ధం చేస్తున్నారు. అయితే నిలోఫర్ ఓపికి వచ్చే సాధారణ పేషెంట్లకు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యసేవలు అందించనున్నారు. అంతేగాక ఆక్సిజన్ సదుపాయాన్ని కూడా పెంచనున్నారు. దీంతో పాటు అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ పిల్లల వార్డులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో సుమారు 25 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేయాలని వైద్యశాఖ భావిస్తుంది. అంతేగాక మందులు కొరత లేకుండా ఇప్పట్నుంచే అవసరమైనవన్నీ స్టాక్ పెట్టుకోవాలని ఉన్నతాధికారులు వైద్యశాఖకు సూచించారు. మరోవైపు థర్డ్ వేవ్ 14 ఏళ్ల లోపు వారిపై అధిక ప్రభావం చూపుతుందని అధికారులూ అంచనా వేస్తున్నారు. ఈమేరకు మన రాష్ట్రంలో ఈ కేటగిరీలో సుమారు 90 లక్షల మంది ఉంటారని అధికారులు చెబుతున్నారు.

TS Govt to announce Niloufer Hospital as nodal centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News