Wednesday, May 22, 2024

తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్స్ వినియోగం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించింది. దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) నుంచి అనుమతి కూడా లభించింది. డ్రోన్ల వినియోగంపై డిజిసిఎ అనుమతి ఏడాది పాటు అమల్లో ఉండనుంది. కరోనా వ్యాక్సిన్ల కొరతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ డోసుల పంపిణీ నిలిపివేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యాధికారులకు వైద్య సంచాలకుడి నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డోసులు వాడుకోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు సూచించారు. మిగలిన టీకా డోసులు సేకరించాలని వైద్యాధికారులకు, ఫార్మసిస్టులకు స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ సరఫరా కోసం అనుమతి కోరుతూ సివిల్ ఏవియేషన్ సంస్థ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ఏడాది మార్చి 9న మెయిల్ ద్వారా ఈ విషయమై అభ్యర్థించింది. ఈ ఏడాది ఏప్రిల్ 29న సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ నుండి అనుమతి లభించింది. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీపై అధ్యయనం చేసేందుకు ఐసిఎంఆర్ కూడా అనుమతిని ఇచ్చింది. పౌరులు ఇంటి వద్దకే నేరుగా వైద్య సేవలను అందించడమే లక్షంగా ఈ డ్రోన్లను ఉపయోగించుకోనున్నారు.

TS Govt to Use Drones for Corona Vaccine deliver

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News