Friday, April 26, 2024

ఐసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వరంగల్ :- ఎంబిఎ, విద్యా సం వత్సరానికి ప్రవేశాల కోసం మే 26, – 27 తేదిల్లో నిర్వహించిన టిఎస్ ఐసెట్ – 2023 ఫలితాలను గురువారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, టిఎస్ ఐసెట్- చైర్మన్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ విశ్వవిద్యాలయ కామర్స్ కళాశాల సెమినార్ హాల్లో టిఎస్ ఐసెట్- 23 కన్వీనర్ ప్రొఫెసర్ పి.వరలక్ష్మి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావుతో కలసి విడుదల చేశారు. మొ త్తం 75925 అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు నమోదు చేసుకోగా, 70900 మంది పరీక్ష రాశారు. వారిలో 61092 మంది (86.17 శాతం) అ ర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన వారిలో బాలురు 29618 బాలికలు 31473 మంది, ట్రాన్స్‌జెండర్ 1 ఒక్కరు ఉన్నారు.

మొదటి 20 ర్యాంకులు వెల్లడించగా వీరిలో 1వ ర్యాంక్ నూకల శరణ కుమార్, హుజూర్‌నగర్, 2వ ర్యాంక్ నగులపాలి సాయి నవీన్, హైదరాబాద్, 3వ ర్యాంక్ రవి తేజ సజ్జ, హైదరాబాద్, 4 వ ర్యాంక్ ఎస్ సాయి ఫణి ధనుష్, హైదరాబాద్, 5వ ర్యాంక్ గోపి మల్లికంటి, సూర్యాపేట, 6వ ర్యాంక్ తిరుగుడు సుమంత్ కుమార్ రెడ్డి, నల్గొండ, 7వ ర్యాంక్ ఆయాచితుల నితీష్ కుమార్, వేములవాడ, 8వ ర్యాంక్ వేదాంతం సాయి వెంకట కార్తీక్, సికింద్రాబాద్, 9వ ర్యాంక్ శ్రిఖకొలను నాగసాయి కృష్ణవంశి, గుంటూరు, 10వ ర్యాంక్ బైరి సాయి గణేష్, మంచిర్యాల, 11వ ర్యాంక్ కొమరపు భానుప్రసన్న, ఏలూరు, 12వ ర్యాంక్ ఇరువంటి సంతోష్ కుమార్, సూర్యాపేట, 13వ ర్యాంక్ నందిపాటి వీరస్వామి, కాకినాడ, 14వ ర్యాంక్ ఉప్పల కౌశిక, హుజూర్ నగర్, 15వ ర్యాంక్ మండవ హనీష్ సత్య, మల్కాజ్ గిరి, 16 వ ర్యాంక్ మామిడి హన్వీ రెడ్డి,

హైదరాబాద్, 17వ ర్యాంక్ రాంపల్లి ఈశ్వర అశోక్, మల్కాజ్ గిరి, 18వ ర్యాంక్ రావూరు ఆశిష్ అభినవ్, మేడిపల్లి, 19వ ర్యాంక్ పోగు విశ్వతేజ, కరకగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, 20వ ర్యాంక్ బెంనేహళ్లి సనుభోగా నూతన్ కుమార్, ముషీరాబాద్ ఉన్నారు, మరిన్ని వివరాలు convenor.icet tsche.ac.in లో చూడవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రొఫెసర్స్ ఎస్.నరసింహ చారి, పి.అమరావేణి, ఎన్.వాసుదేవ రెడ్డి, వై.వెంకయ్య, పి.కృష్ణమాచారి, డాక్టర్ ఎం.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News