Wednesday, May 8, 2024

లాసెట్ సర్టిఫికెట్ల అప్‌లోడ్ గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: లాసెట్‌లో కౌన్సెలింగ్‌లో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల అప్‌లోడ్ గడువును 29 వరకు పొడిగించారు. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ పి.రమేష్ బాబు రీ షెడ్యూల్ విడుదల చేశారు. వివిధ యూనివర్సిటీలు ఫలితాలు వెల్లడించాల్సి ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల అప్‌లోడ్ గడువును మరో వారం రోజులు పొడిగించినట్లు తెలిపారు. వచ్చే నెల 1,2 తేదీలలో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 19 నుంచి 22 వరకు ఎన్‌సిసి,సిఎపి, పిహెచ్, స్పోర్ట్ తదితర స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 2021 జనవరి 5వ తేదీన మొదటి విడత లాసెట్ సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 5 నుంచి 8 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలని, అదే సమయంలో విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీస్తారని పేర్కొన్నారు. జనవరి 6 నుంచి న్యాయ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. రెండవ విడత షెడ్యూల్‌ను తర్వాత వెల్లడిస్తారని పేర్కొన్నారు. వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.

TS LAWCET 2020 Counselling date extend to Dec 29

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News