Tuesday, May 14, 2024

టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో నిందితుడి అరెస్ట్… కస్టడీ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలిం చారు. దీంతో అరెస్టుల సంఖ్య 51కి చేరుకుంది. తాజాగా అరెస్టైన నిందితుడి పేరు మహమ్మద్ ఖలిద్. అతనిని తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సిట్ అధికారులు చంచల్ గూడ జైలు నుండి ఖలిద్ ను కస్టడీకి తీసుకున్నారు. రమేష్ కు ఖలిద్ హైటెక్ కాపీయింగ్‌కు సహక రించినట్లుగా సిట్ గుర్తించింది. మలక్‌పేటలోని ఖలిద్ గదిలో కంప్యూటర్ ఏర్పాటు చేసి, పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఈ గది నుండి రమేష్ సమాధానాలు చేర వేసినట్లు గుర్తించారు. మరోవైపు, ఈ కేసులో గతంలో 23 మందికి, తాజాగా ఆరుగురుకి బెయిల్ మంజూరైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News