Sunday, May 5, 2024

ఆదాయం పెంపు కోసం.. ఆర్టిసి అధికారుల తిప్పలు

- Advertisement -
- Advertisement -

RTC officials are working to increase revenue

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఆర్టిసి ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. సెప్టెంబర్ 25 నుంచి ఆర్డిసి అధికారులు 39 రూట్లులో 730 బస్సులను ( 20శాతం ) బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే నగరంలో బస్సులు రోడ్డెక్కి నెల రోజులు దాటినా ప్రయాణికులు నుంచి వస్తున్న స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ప్రయాణికుల టికెట్‌ద్వారా వచ్చేఆదాయం కనీస అవసరాలకు కూడా సరిపోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరి కొద్ది రోజుల వరకు గతంలో మాదిరిగా 29డిపోలతో 2750 బస్సులను నడిపే పరిస్థితి కనిపించడం లేదు. బస్సులను తిప్పేందుకు అధికారులు పూర్తిఏర్పాట్లు చేసినా బస్సులను నగరంలో తిప్పేందుకు ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కార్గో, పార్సిల్ సర్వీసుల ద్వారా వచ్చేఆదాయం సంస్థ రోజువారీ ఆదాయంలో కలిపిన జీతభత్యాల సంగతి అటుంచి కనీసం నిర్వాహణ వ్యయం కూడా రావడం లేదు. దాంతో అధికారులు ఆదాయంపెంపునకు కృషి చేస్తున్నారు.

ఇందులో భాగంగా సిబ్బంది స్వయంగా ప్రధాన బస్టాపుల్లో ఉండి కరోనా సంబంధిత జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటుంది. తాము చేసిన ఏర్పాట్లు గురించి ప్రయాణికులకు వివరిస్తూ ఒక వైపు కరోనా పట్ల వారికి అవగాహన కల్పిస్తూ సిటీ బస్సుల్లో ప్రయాణికులకు ఉన్న భద్రతకు సంబంధించిన అంశాలను కూడా వివరిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం ద్వారా వచ్చే నష్టాలను కష్టాలను వారికి వివరిస్తూ వారిని ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించే దిశగా వారిని మోటివేట్ చేస్తున్నారు. అంతే కాకుండా బస్టాపుల్లో ప్రైవేట్ వాహనాలైన ఆటోలు, ఇతర వాహనాలను నిలపకుండా చేయడమే కాకుండా అక్కడ ఉన్న ప్రయాణికులకు బస్సులు రాకపోకల సమాచారాన్ని తెలియ చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా బస్టాపుల్లో ప్రయాణికులు ఉన్నా లేకున్నా తప్పకుండా వాటిలో కనీసం రెండు మూడు సెకన్లపాటు బస్సును ఆపేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా ప్రయాణికులు బస్సును ఆపేందుకు చెయ్యి ఎత్తిన వెంటనే బస్సులను ఆపి సదరుప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు.

ముఖ్యంగా కోటీ, దిల్ సుఖ్ నగర్, రైతిఫల్ , తదితర ప్రధానబస్టాపుల్లో తమ బస్సు రూ రూట్లో ప్రయాణిస్తుందని , ఏ ప్రాంతాల మీదుగా వెళుతుందని అనే అంశాలను ప్రయాణికులకు తెలియ చేయడమే కాకుండా బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులు వారు దిగాల్సిన స్టేజీలను మరీ గుర్తు చేసి ఆపుతున్నారు. అంతే కాకుండా ఆర్దిసి అధికారులు లాక్‌డౌన్ సమయంలో ప్రారంభించిన కార్గో, పార్సిల్ సర్వీసుల సేవలను ప్రయాణికులకు వివరిస్తూ సంస్థకు టికేటేతర ఆదాయాన్ని కూడా పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. కరోనా అన్నివర్గాల ఆదాయంపై కూడా ప్రభావం చూపిందని దాని ప్రభావం సంస్థపై కూడా పడిందని, గతంలో తాము ప్రతి నెలా 31 వేతనాలు తీసుకునేవాళ్ళమని కాని ప్రస్తుతం తమకు వేతనాల కోసం పదో తారీఖీ వరకు ఎదురు చూడాల్సి వస్తోందని, ఏ సంస్థకైనా ఆదాయం ఉంటనే కదా వేతనాలు సమయానికి వచ్చేది.. ప్రస్తుతం సంస్థ ఇబ్బందుల్లో ఉందని పరిస్థితిని ఆర్దం చేసుకుని సంస్థ ఆదాయం పెంచేందుకు తమ వంతుకృషి చేస్తున్నామని వారు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News