Tuesday, May 14, 2024

ఇంకోసారి ఇంకోసారి…

- Advertisement -
- Advertisement -

Tuck Jagadish poster release

 

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, – హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రీతూ వర్మ, – ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ’ఇంకోసారి ఇంకోసారి’ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ స్వరపరిచిన ఈ మ్యాజికల్ మెలోడీ సాంగ్‌ని ఈ నెల 13న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ పోస్టర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరోయిన్ రీతూ వర్మ కూర్చొని ఉండగా.. హీరో నాని ఆమె చేయి అందుకొని కళ్లలోకి చూస్తూ ఉన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News