Sunday, May 5, 2024

పెద్ద అంబర్‌పేట్ వద్ద రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two death in road accident at Pedda Amberpet

అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేష్‌న్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. సిఐ స్వామి కథనం ప్రకారం… ఆంద్రప్రదేశ్ గుంటూరు జిల్లా పామిడిపాడు నర్సరావుపేట నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న (ఎపి07ఈసీ5599) ఇన్నోవా క్రిస్టా కారు డ్రైవర్ కాసిందుల హనుమంతరావు(39) పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగనే మూత్ర విసర్జన కోసం కారు పక్కకు ఆపి దిగుతున్నాడు. అదే సమయంలో కారు వెనుకలే ఇనుప పైపుల లోడుతో డిసిఎం (ఎపి29యూ2852) వస్తుంది. దాని వెనుకలే మిర్చి లోడుతో మారో డిసిఎం(ఎపి39టిఎన్8699) వాహనం అతివేగంగా వచ్చి ముందు ఉన్న ఇనుప పైపుల లోడు డిసిఎంను బలంగా ఢీకొట్టింది.

దీంతో ఇనుప లోడుతో ఉన్న డిసిఎం ముందు అగి ఉన్న ఇన్నోవా కారును ఢీకొటింది. ఈ ఘటనలో ఇన్నోవా కారు డ్రైవర్ హనుమంతరావు అక్కడిక్కడే మృతి చెందాడు. అదే విధంగా మిర్చి లోడుతో డిసిఎంలో వస్తున్న ఒంగోలు జిల్లా మర్టూర్ మండలం నారాన్నవారిపాలెంకు చెందిన రైతు ముద్దన రామచంద్రయ్య(75) కూడా మృతి చెందారు. ఇనుప పైపుల లోడ్ డిసిఎం డ్రైవర్ తీవ్ర గాయాలతో క్యాబ్‌న్‌లో ఇరుకున్నాడు. పోలీసులు అతి కష్టం మీద క్యాబిన్‌లో నుండి డ్రైవర్‌ను క్రేన్ సాయంతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరిని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనలో మూడు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News