Tuesday, April 30, 2024

సూటిపోటి మాటలు తట్టుకోలేకనే

- Advertisement -
- Advertisement -

two months baby murdered in hyderabad

సూటిపోటి మాటలు తట్టుకోలేకనే
రెండు నెలల బాలుడి హత్య
ఆడపడుచుపై కోపంతో బాలుడిని హత్యచేసిన వదిన
మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

వనస్థలిపురం: తనకు పిల్లలు పుట్టరని పదేపదే సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్న ఆడపడుచు మాటలను తట్టుకోలేక ఆమె కుమారున్ని ఇంటిపై ఉన్న నీటి ట్యాంక్‌లో వేసి దారుణంగా హత్య చేసింది. శనివారం వనస్థలిపురం ఎసిపి పురుషోత్తంరెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్ల డించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన మంచాల రంగయ్య గౌడ్‌కు కూమారుడు, కూతురు ఉన్నారు. కూతురిని ఇబ్రహీపట్నం మండలం నెర్రపల్లికి చెందిన దూసరి తిరుమలేష్‌తో గత 12 సంవత్సరాల కిత్రం వివాహం చేశారు. 12 సంవత్సరాల తర్వాత తిరుమలేష్, లతకు బాబు పుట్టాడు. కూతురుకు చాలా సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టినాడని లాంచనాల ప్రకారం రంగయ్య కూతురు లతను, పుట్టిన బాబును పుట్టింటికి తీసుకువచ్చాడు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు అందరు నిద్రపోయారు. లత తన కుమారున్ని పక్కన పడుకోపెట్టుకొని నిద్రపోయింది.

మధ్యలో బాబు ఏడుస్తుంటే పాలు ఇచ్చి తిరిగి నిద్రకు ఉపక్రమించింది. రంగయ్య కోడలు స్వేత లత పుట్టిన కూమారున్ని ఏలాగైనా చంపాలని గత కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న తరుణంలో తన మనషులో ఉన్న పథకం ప్రకారం పాలు తాగి పడుకున్న బాబును తీసుకొని ఇంటిపై ఉన్న నీటి ట్యాంక్‌లో పడేసింది. బాబు చనిపోయిన తర్వాత తిరిగి కిందికి వచ్చి పడుకున్నది. శుక్రవారం ఉదయం లత లేచి చూడగా పక్కన బాబు కనిపించక పోవడం ఆందోళనకు గురై ఇంట్లో బాబు కోసం అటు ఇటు వెతికినా ఆచూకీ దొరకక పోవడంతో చివరకు పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు సంఘటనా స్థలంలోకి వెళ్లి పరిసర ప్రాంతాలలో బాబు కోసం వెతికారు చివరకు ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంక్‌లో బాబు పడి ఉన్నాడని గుర్తించి ఆసుప్రతికి తరలించారు. బాబును పరీక్షించిన డాక్టర్ బాబు చనిపోయాడని వెల్లడించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. బాబును చంపిన స్వేత పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టగా భయాందోళనకు గురై బాబును నీటి ట్యాంక్‌లో వేసి చంపానని ఒప్పుకున్నది. పోలీసుల విచారణలో నాకు ఈమధ్యనే అబార్షన్ అయిందని, నాకు థాయిరాడ్ ఉన్నదని ఇక పిల్లలు పుట్టరని లత పదేపదే సూటిపోటి మాటలు అనడంతో మనోవేదనకు గురై ఈఘాతకానికి పాల్పడినట్లు స్వేత అంగీకరించినట్లు ఎసిపి వెల్లడించారు. దీంతో పోలీసులు శనివారం స్వేతను రిమాండ్‌కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News