Friday, April 26, 2024

ఏపి విటిపిఎస్‌లో ఘోరం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంలోని విటిపిఎస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం సుమారు 8 గంటల 45 నిమిషాల సమయంలో థర్మల్ పవర్ స్టేషన్‌లో లిఫ్ట్ వైర్ తెగి కింద పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. విటిపిఎస్‌లో నూతనంగా ఐదవ భవంతి నిర్మాణం జరుగుతోంది. అయితే భవంతి నిర్మాణ పనులను చేపట్టేందుకు మొదట కొంత మంది లిఫ్ట్‌లో ఎక్కగా అది పని చేయలేదు. లిఫ్ట్ పని చేయటం లేదని అందులోని కొంత మంది కిందకు దిగి పోయారు. లిఫ్ట్‌లో ఉన్న అందరూ కిందకు దిగక ముందే లిఫ్ట్ తలుపులు మూసుకుపోయాయి. అందులో కొందరు ఉండగానే కింది లిఫ్ట్ పైకి చేరి అక్కడి నుండి వైరు తెగిపడి అమాంతం కింద పడి పోయిందని కార్మికులు చెప్పారు.

ఈ ప్రమాదంలో లిఫ్ట్‌లో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరి కొంత మంది గాయాల పాలైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఎనిమిది ఉన్నట్లు సమాచారం. కాగా ఇద్దరి మృత దేహాలను విటిపిఎస్ బోర్డు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై అటు కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఉదయం 8.45 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. వీటిపిఎస్ నిర్లక్ష ధోరణి వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపంతో లిఫ్ట్ సామర్ధం మించి కార్మికులు ఎక్కారని అందువల్లే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News