Tuesday, August 5, 2025

విద్యుత్ తీగ పడడంతో వ్యక్తి సజీవదహనం

- Advertisement -
- Advertisement -

గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు పొలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో వాహనంతో సహా దగ్ధమై అక్కడికక్కడే మృతి చెందాడు.  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు గ్రామానికి చెందిన పర్సిక రాజు(35) అనే వ్యక్తి తన బైక్ వెళ్తుండగా గ్రామ శివారులో అతడిపై విద్యుత్ తీగ పడింది. బైక్ తో సహా అతడు కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం గుండాల ప్రభుత్వాత్రికి తరలించారు. మంటల్లో కాలిపోతున్న యువకుడిని చూసి కుటుంబ సభ్యులు, బంధువుల బాధపడే తీరు అందరినీ కలిచి వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News