Thursday, May 2, 2024

కొరియా ద్వీపకల్పంలో తుపాను బీభత్సం

- Advertisement -
- Advertisement -

సియోల్: కొరియా ద్వీపకల్పంలో గురువారం తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షం, పెనుగాలులకు వందలాది ఇళ్లు, భవనాలు ధ్వంసంకాగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక చోట్ల రోడ్డు జలమయమయ్యా. దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు తెలియరాలేదు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ వద్ద సముద్ర తీరాన్ని దాటిన వాయుగుండం చైనా వైపు పయనిస్తున్నట్లు దక్షిణ కొరియా వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 133 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకొరిగినట్లు ఉత్తర కొరియాకు చెందిన సెంట్రల్ టివి తెలిపింది. ఉత్తర హ్వాంగే, దక్షిణ హ్వాంగే ప్రావిన్సులలో తుపాను తీవ్ర విధ్వంసం సృష్టించినట్లు టివిలో వార్తలు ప్రసారమయ్యాయి.

Typhoon damages buildings and roads on Korean Peninsula

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News