Saturday, April 27, 2024

మా వైపు రండి గెలిపిస్తాం..పవరిస్తాం: ఉద్ధవ్ థాకరే

- Advertisement -
- Advertisement -

యవత్మాల్: బిజెపి వీడి ప్రతిపక్షంలోకి రావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి ఆహ్వానించారు. బిజెపిలో ఈ విధంగా ఎంతకాలం అని అవమానాలకు గురవుతారు? పట్టించుకోవడం లేదని భావిస్తే పార్టీ వీడి రండని ఉద్ధవ్ యవత్మాల్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో పిలుపు నిచ్చారు. లోక్‌సభ ఎన్నికల వేళ గడ్కరికి ఉద్ధవ్ పిలుపు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. బిజెపి వీడండి, బాధపడకండి, వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మీ సీటు నుంచి మీ విజయం ఖాయం చేస్తామని కూడా ఉద్ధవ్ తెలిపారు. బిజెపి ఎంపిల పేర్లు వెలువడుతున్నాయి. ఇప్పటికీ గడ్కరీకి సీటు ప్రకటించలేదు. మాజీ కాంగ్రెస్ నేత, ఇంతకు ముందు బిజెపి టార్గెట్ పెట్టుకున్న కృపాశంకర్ సింగ్‌కు కూడా ఇప్పటికే బిజెపి సీటు ఇచ్చింది.

ఇంతవరకూ గడ్కరీకి సీటు ఇవ్వలేదు. ఇది అవమానం కాక మరేమవుతుందని ప్రశ్నించారు. పార్టీలో అవమానాలను దిగమింగుతూ ఉంటారా? లేకప్తో బయటికి రండి. మాతో కలిస్తే మీ గెలుపు ఖాయం చేస్తామని ఈ సభ ద్వారా ఆయన గడ్కరికీ పిలుపు నిచ్చారు. తాను రెండురోజుల క్రితం గడ్కరీకి ఇదే విషయం వ్యక్తిగతంగా కూడా చెప్పానని , ఇప్పుడు ఈ సభాముఖంగా తెలియచేస్తున్నానని వివరించారు. రండి మా మహా వికాస్ అఘాదీ (ఎంవిఎ)లో చేరండని కోరుతున్నాను. మీరు వస్తే గెలుస్తారు. తమ ప్రభుత్వం వస్తే అధికారాలు ఉండే మంత్రి పదవిలో మీరు కూర్చుంటారని తెలిపారు.

మీ పని మీరు చూసుకోండి: గడ్కరీ
ఉద్ధవ్ థాకరే మాటలపై నితిన్ గడ్కరీ స్పందించారు. ఇటువంటి అసందర్భ, తెలివితక్కువ మాటలకు దిగవద్దని, అయినా పార్టీ టికెట్ల ఎంపిక అంతర్గత విషయం. బిజెపికి ఈ విషయంలో ఓ పద్థతి ఉంటుంది. కాషాయ పార్టీ నేతల గురించి యుబిటి నేత ఆందోళన అవసరం లేదని ఎదురుదాడికి దిగారు. బిజెపి తొలి జాబితాలో నితిన్ గడ్కరికి చోటు కల్పించలేదు. ఆయన కొన్ని దశల్లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలకు దిగాడనే అంశం పార్టీ అధినాయకత్వంలో పరిగణనలోకి వచ్చిందని,ఈ మేరకు గడ్కరికి టికెట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జోరందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News